రాజు గారికి ప్రత్యర్ధిని సిద్ధం చేసిన వైసీపీ
TeluguStop.com
2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గం( Narasapuram Constituency ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు కనుమూరి రఘురామకృష్ణంరాజు.
( Raghurama Krishnam Raju ) గెలిచిన కొద్ది నెలలకే ఆయన రెబల్ గా మారారు.
తరచుగా వైసిపి అధినేత జగన్ ను, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయన విమర్శలు చేస్తున్న తీరు వైసిపికి ఇబ్బందికరంగానే మారింది .
టిడిపి ,జనసేన లకు దగ్గరగా ఉంటూ రెండు పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు .
ఇక వచ్చే ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామకృష్ణంరాజు సిద్ధమవుతున్నారు.
"""/" /
టిడిపి, జనసేన ఈ రెండు పార్టీలను ఆప్షన్ గా పెట్టుకున్నారు.
అయితే టిడిపి( TDP ) నుంచి పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఆయన టిడిపిలో చేరినా టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది.
ఒకవేళ టిడిపి ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు బరిలోకి దిగితే ఆయనకు ప్రత్యర్థిగా సినీ నటుడు , దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని( Shyamaladevi ) అభ్యర్థిగా దింపాలనే ఆలోచనతో వైసిపి ఉంది .
శ్యామల దేవిని అభ్యర్థిగా బరిలోకి దింపడం ద్వారా, ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) ఓట్లు కూడా కలిసి వస్తాయని ,ఆ ప్రభావం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పైన ఉంటుందని వైసీపీ( YCP ) అంచనా వేస్తోంది.
ఈ మేరకు శ్యామలాదేవిని పోటీకి ఒప్పించేందుకు అదే జిల్లాకు చెందిన వైసిపి నేత ఒకరు రంగంలోకి దిగినట్లు సమాచారం.
కృష్ణం రాజు( Krishnam Raju ) సతీమణి తో రఘురామకు చెక్ పెట్టాలని వైసిపి ప్లాన్ చేస్తోంది.
"""/" /
1999లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పుడు నరసాపురం నుంచి శ్యామలాదేవిని పోటీకి దించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గం ఓట్లతో పాటు , సినీ హీరో ప్రభాస్ సైతం ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుందని , అలా కాకపోయినా శ్యామలాదేవిని గెలిపించాల్సిందిగా ఆయన ప్రకటన ఇస్తారని ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసిపి అంచనా వేస్తోంది .
దారుణం, రక్షకుడే భక్షకుడయ్యాడు.. పబ్లిక్‌లో యువతిని రక్తం వచ్చేలా ఎలా కొట్టాడో చూస్తే..