ఎండు ద్రాక్ష.( Raisins ) చాలా మంది ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్ లో ఒకటి.
చూడడానికి చిన్న పరిమాణంలో కనిపించిన ఎండు ద్రాక్ష ఎంతో రుచికరంగా ఉంటుంది.అలాగే అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
రక్తహీనతను తరిమి కొట్టడానికి, క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఎండు ద్రాక్ష ఉత్తమంగా సహాయపడుతుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని( Beauty ) పెంచడానికి కూడా ఎండు ద్రాక్ష సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఎండు ద్రాక్షతో చర్మానికి( Skin ) ఎలా మెరుగులు పెట్టవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది ఎండు ద్రాక్షలు వేసి అర కప్పు కాచి చల్లార్చిన పాలు( Milk ) పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలను వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి,( Rose Petal Powder ) వన్ టేబుల్ స్పూన్ శనగపిండి,( Besan Flour ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే మీ చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది.స్కిన్ టోన్( Skin Tone ) ఇంప్రూవ్ అవుతుంది.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.చర్మం తరచూ డ్రై అవ్వకుండా ఉంటుంది.ఎలాంటి మచ్చలు ముడతలు లేకుండా తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి.
అందంగా మెరిసిపోండి.