Megastar Chiranjeevi : బాలయ్య సినిమాకు చిరంజీవి స్పెషల్ విషెస్.. తన సినిమా కంటే బాలయ్య పెద్ద హిట్ కొట్టాలంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Chiranjeevi Special Wishes To Balayya-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టిగా ఇస్తున్నారు.

గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఇకపోతే మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ట ( vasista )దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Balayya Babu, Chiranjeevi, Wishes, Tollywood-Movie

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు శరవేగంగా జరుగుతోంది.ఇకపోతే టాలీవుడ్ నందమూరి హీరో బాలయ్య బాబు( Balayya Babu ) విషయానికి వస్తే.బాలయ్య బాబు గత ఏడాది వీరసింహారెడ్డి ( Veerasimha Reddy )సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.అదే ఊపుతో ప్రస్తుతం మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు.

అందులో భాగంగానే బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించిన తర్వాత బాబి ప్రస్తుతం బాలయ్యతో ఒక సినిమాను చేస్తున్నారు.అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ తన స్పెషల్ విషెస్ తెలియజేసారు అని బాబీ తెలిపాడు.

Telugu Balayya Babu, Chiranjeevi, Wishes, Tollywood-Movie

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ( Director Bobby ) మాట్లాడుతూ.తాను బాలయ్య గారితో సినిమా స్టార్ట్ చేసినపుడు తనకి కాల్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు అని మన సినిమా కంటే బాలయ్య గారితో పెద్ద హిట్ కొట్టాలని వారు చెప్పారని బాబీ తెలిపాడు.దీనితో బాలయ్య సినిమా విషయంలో చిరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.కాగా ఈ ఇద్దరు హీరోలు గత ఏడాది సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా అందులో బాలయ్య బాబు నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా చిరంజీవి సినిమా పరవాలేదు అనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube