సాధారణంగా కొందరు తల్లీకూతుర్లు, తండ్రీకొడుకుల మధ్య ఏజ్ గ్యాప్( Age Gap ) చాలా ఎక్కువగా ఉన్న వారు మాత్రం చూసేందుకు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెలు లాగా కనిపిస్తారు.ఇటీవల ఒక తల్లి తనకు పదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్న ఆమె మాత్రం 20 ఏళ్ల వయసులో ఉన్న యువతి లాగానే కనిపించింది.
ఇలాంటి మరొక యవ్వనంగా ఉన్న తల్లి( Mother ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ తల్లి, ఆమె కొడుకు ఇంటర్నెట్‌లో చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఎందుకంటే వారు ఇతర తల్లులు, కొడుకుల కంటే చాలా భిన్నంగా ఇస్తున్నారు.తల్లికి 45 ఏళ్లు, కొడుకు వయసు 20 ఏళ్లు అయినప్పటికీ చాలా మంది వీరిని చూసి అక్క తమ్ముళ్లు( Brother Sister ) అని, లేదంటే పార్ట్‌నర్స్ అని అనుకుంటున్నారు.
ఎందుకంటే తల్లి చాలా యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది, ఆమె 20 ఏళ్ల వయసులో ఉన్న పడుచు పిల్ల లాగా కనిపిస్తుంది.
తల్లి పేరు జెస్సీ గోల్డెన్,( Jesse Golden ) ఆమె వయస్సు 45 సంవత్సరాలు.ఆమె తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తోంది.టిక్‌టాక్‌లోని వీడియోలో ఆమె తన బేబీ బంప్‌ను( Baby Bump ) చూపించింది.
ఈ వీడియో విశేష ఆదరణ పొందింది.వీడియోలో ఆమె తన 20 ఏళ్ల కొడుకుతో కూడా కనిపిస్తుంది.
తల్లి చాలా యవ్వనంగా కనిపిస్తుంది, వారు తల్లి, కొడుకు అని నెటిజన్లు నమ్మలేకపోతున్నారు.ఆమెకు నిజంగా 45 ఏళ్ల వయస్సు ఉంటుందా అని కూడా కొంతమంది అనుమానిస్తున్నారు.
చాలా మంది ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, జెస్సీ, ఆమె కొడుకు డేటింగ్ చేస్తున్నారేమోనని పొరపడ్డామని క్షమాపణలు చెబుతున్నారు.ఇతరులు ఏమనుకుంటున్నారోనని జేసీ ఆందోళన చెందవద్దని, తన కొడుకుతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడాలని కూడా కొందరు అన్నారు.