సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు.
అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పెద్దగా ఆడలేదు ఇక అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్టుగా కూడా వార్తలయితే వచ్చాయి.
ఇక దాంతో వాళ్ల అమ్మ ఎన్టీయార్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వి వి వినాయక్,( VV Vinayak ) ఎస్ఎస్ రాజమౌళి లను( SS Rajamouli ) పిలిపించి మాట్లాడిపించింది.
ఇక దాంతో వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ ని మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి చెరొక సినిమా చేసి సక్సెస్ ఇస్తామంటూ మాటిచ్చారు.ఇక అందులో భాగంగానే రాజమౌళి యమదొంగ సినిమా( Yamadonga ) చేసే సక్సెస్ ఇస్తే వినాయక అదుర్స్ సినిమా( Adhurs ) చేసి మంచి సక్సెస్ ని అందించాడు.
ఇలా వీళ్ళిద్దరూ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంతో మళ్ళీ ఇండస్ట్రీలో సత్తా చాటుకుంటూ ముందుకు వెలుతున్నాడు.ఇక ఇప్పుడు ఆయన హిట్లు ప్లాప్ లు అన్ని చూసేసి ఉన్నాడు కాబట్టి ఏది వచ్చిన కూడా లైట్ తీసుకుంటూ ముందు కదులుతున్నాడు.ఎందుకంటే ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్ అనే విషయం ఆయనకు అర్థమైపోయింది.ఇక అందులో భాగంగానే ఇప్పుడు హిట్ కొట్టడానికి కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కనక సక్సెస్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాని చాటుకోవడం పక్క అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే బీభత్సమైన అంచనాలను పెంచుకుంటున్నారు.మారి ఈ సినిమాతో ఎన్టీయార్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.ఇక ఈ సినిమా రెండు పార్టులు గా వస్తుంది కాబట్టి ఈ సినిమా రెండో పార్ట్ కోసం మొదటి పార్ట్ ఎండింగ్ లో ఒక భారీ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది…
.