కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ లో ప్రారంభమైంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మణిపూర్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు.
ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ లో పర్యటించలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మణిపూర్ ను భారత్ లో అంతర్భాగంగా భావించడం లేదని ఆరోపించారు.
దేశ ప్రజలను ఏకం చేయడానికి తాను భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో మణిపూర్ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడానికే ఇక్కడి నుంచి యాత్రను ప్రారంభించినట్లు వెల్లడించారు.