ఏపీలో కాపు సంఘం నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.కాపు సంఘం పెద్దలు చేస్తున్న విమర్శలకు లేఖ ద్వారా జనసేనాని కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కొందరు కాపు నేతలను కావాలనే రెచ్చగొడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.అయితే తాము కాపు పెద్దలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని తెలిపారు.
కాపు నేతలు తనను దూషించిన వాటిని దీవెనలుగానే స్వీకరిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.తనను ఎంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని పేర్కొన్నారు.
రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని తెలిపారు.కుట్రలతో వైసీపీ అల్లిన వలలో చిక్కుకోవద్దన్న జనసేనాని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కార్యాచరణ మొదలుపెట్టానని స్పష్టం చేశారు.