అఫిషియల్ : సంక్రాంతికే ''నా సామిరంగ''.. మూడు రోజుల్లో ఎప్పుడు రాబోతుందంటే?

సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్( Tollywood ) మొత్తం సిద్ధం అవుతుంది.ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

 Nagarjuna Naa Saami Ranga Release Date Final, Naa Saami Ranga Release Date , Mir-TeluguStop.com

దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది.మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా కనిపించడం లేదు.

ఈసారి సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ బరిలోకి దిగనున్నారు.

మరి ఈ సినిమాల పోటీ వల్ల థియేటర్స్ దగ్గర క్లాషెస్ తప్పేలా లేదు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నాగార్జున నా సామిరంగ ( Naa Saami Ranga) సినిమా మాత్రం సంక్రాంతికి అని చెప్పిన డేట్ ఫిక్స్ చేసుకోలేదు.దీంతో ఏమైనా ఈ సినిమా వెనక్కి తగ్గిందేమో అనే అనుమానాలు వచ్చాయి.

కానీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి మేము కూడా ఉన్నాం అంటూ నా సామిరంగ రిలీజ్ డేట్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాను పొంగల్ రేసులో నిలబోతున్నట్టు పండుగ మూడు రోజుల్లో ఒక రోజును ఫిక్స్ చేసారు.ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉన్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు టైటిల్ ప్రోమోతో ప్రకటించారు.దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయనుంది.

కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్ ( Mirnaa Menon ) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.

https://youtu.be/Z3iL2nhISgA
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube