ఆ జాతి ప్రజలకు సులభంగా హోమ్ లోన్ .. బ్యాంక్ ఆఫ్ అమెరికా నిర్ణయం , తప్పుబట్టిన వివేక్ రామస్వామి

బ్లాక్ అండ్ హిస్పానిక్ కమ్యూనిటీలకు చెందిన ప్రజలకు “డౌన్ పేమెంట్ లేకుండా” హోమ్ లోన్‌లను( Home Loans ) అందించాలని బ్యాంక్ ఆఫ్ అమెరికా( Bank of America ) తీసుకున్న చర్యపై భారత సంతతి రిపబ్లికన్ నేత, అమెరికా అధ్యక్ష అభ్యర్ధి వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) విరుచుకుపడ్డారు.ఈ మేరకు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఆయన ట్వీట్ చేశారు.

 Indian-american Presidential Aspirant Vivek Ramaswamy Slams Bank Of Americas Ant-TeluguStop.com

మైనారిటీ వర్గాల ప్రజలు కానుకు రుణం ఎగవేస్తే.ఇవాళ్టీ జాత్యహంకార వ్యతిరేక చర్యను రేపు వ్యవస్థాపరమైన జాత్యహంకారంగా పిలుస్తారని అభివర్ణించారు.

షార్లెట్, డల్లాస్, డెట్రాయిట్, లాజ్ ఏంజిల్స్, మయామి వంటి ప్రదేశాలలో బ్లాక్ , ఆఫ్రికన్ అమెరికన్ అండ్ హిస్పానిక్ లాటినో కమ్యూనిటీలలోని ప్రాపర్టీలకు కమ్యూనిటీ అఫర్డబుల్ లోన్ సొల్యూషన్ ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది.అర్హులైన వ్యక్తులు ఈ చర్య ద్వారా ఇంటిని కొనుగోలు చేసేందుకు సరసమైన రుణాన్ని పొందవచ్చని తెలిపింది.

Telugu Racist, Bank America, Hispaniclatino, Loans, Indian American, Vivek Ramas

కమ్యూనిటీ అఫర్డబుల్ లోన్ సొల్యూషన్( Community Affordable Loan Solution ) అనేది స్పెషల్ పర్పస్ క్రెడిట్ ప్రోగ్రామ్.ఇది సకాలంలో అద్దె, యుటిలిటీ బిల్లు, ఫోన్ అండ్ ఆటో ఇన్సూరెన్స్ చెల్లింపులు వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకుంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆన్‌లైన్‌లో తెలిపింది.దీనికి తనఖా బీమా లేదా కనీస క్రెడిట్ స్కోర్ అవసరం లేదని పేర్కొంది.వ్యక్తి అర్హత ఆదాయం, ఇంటి స్థానంపై ఆధారపడి వుంటుందని వెల్లడించింది.ఏ జాతికి చెందిన వ్యక్తయినా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.ఈ కొత్త కార్యక్రమం 2025 నాటికి 60 వేల మంది వ్యక్తులు , కుటుంబాలు సరసమైన గృహాలను కొనుగోలు చేయడానికి, పరిశ్రమ గ్రాంట్లు, విద్యా అవకాశాలను అందించడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా 15 బిలియన్ డాలర్ల కమ్యూనిటీ హోమ్ ఓనర్‌షిప్ కమిట్‌మెంట్ లక్ష్యానికి అనుగుణంగా వ్యవహరిస్తుందని పేర్కొంది.

Telugu Racist, Bank America, Hispaniclatino, Loans, Indian American, Vivek Ramas

శ్వేతజాతీయులు, నల్లజాతి అమెరికన్ల మధ్య గృహ యాజమాన్యంలో దాదాపు 30 శాతం పాయింట్ల అంతరం వుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్( National Association of Realtors ) పేర్కొంది.హిస్పానిక్( Hispanic Community ) కొనుగోలుదారుల విషయానికి వస్తే ఈ గ్యాప్ 20 శాతం వుంది.ఇది శ్వేతజాతీయేతర వ్యక్తులకు గృహాలను కొనుగోలు చేయడం కష్టతరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇంటి యాజమాన్యం తమ కమ్యూనిటీలను బలపరుస్తుందని, వ్యక్తులు, కుటుంబాలు కాలక్రమేణా సంపదను నిర్మించుకోవడంలో సహాయపడగలవని నైబర్‌హుడ్ అండ్ కమ్యూనిటీ లెండింగ్ హెడ్ ఏజే బార్క్లీ తెలిపారు.

ఈ లోన్ సొల్యూషన్ వల్ల నల్లజాతి, హిస్పానిక్ కుటుంబాలకు స్థిరమైన ఇంటి యాజమాన్యం కలను సాధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube