మెరిసే చేపను తయారుచేసిన శాస్త్రవేత్తలు.. వీడియో చూస్తే ఫిదా..

జెనెటిక్ ఇంజనీరింగ్( Genetic engineering ) అంటే జంతువులలోని జన్యులను మార్చేసి కొత్త లక్షణాలను సృష్టించడం.జన్యులను మార్చేస్తే జంతువులు లేదా జీవులు కొత్త విధులను కూడా చేయగలవు.

 Scientists Made A Shiny Fish, Jellyfish Genes, Carp Fish, Dna Modifying, Viral N-TeluguStop.com

ఈ టెక్నాలజీ ఒక అద్భుతం అని చెప్పవచ్చు.అయితే ఒకానొక సమయంలో దీనిని ఉపయోగించి తైవాన్‌లోని శాస్త్రవేత్తలు( Scientists in Taiwan ) మెరుస్తున్న చేపలను సృష్టించారు.

వారు జెల్లీ ఫిష్ నుంచి జన్యువులను తీసుకొని కార్ప్ చేపల డీఎన్ఏలోకి ప్రవేశపెట్టారు, అంతే ఇంకేముంది ఆ చేపలు చీకటిలో మెరిసిపోతూ ఆశ్చర్యపరిచాయి.ఈ చేపలకు సంబంధించిన వీడియోను తాజాగా @gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

ఈ అమేజింగ్ వీడియోకి ఇప్పటికే ఒక కోటి 78 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

సాధారణంగా, జెల్లీ ఫిష్( Jellyfish ) జన్యువులలో గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ (GFP) అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది జెల్లీ ఫిష్‌లో కనిపించే బయోలుమినిసెన్స్ లేదా సహజ కాంతి ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది.అందుకే జెల్లీ ఫిష్‌లు నీళ్లలో మెరుస్తూ మనకి కనిపిస్తుంటాయి.మైక్రోఇంజెక్షన్ అనే సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్ జన్యువులను కార్ప్ పిండాలలోకి చొప్పించారు.

జన్యుపరంగా మార్పు చెందిన కార్ప్‌లు పెరిగేకొద్దీ, అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు లేదా చీకటి పరిస్థితుల్లో ఉంచినప్పుడు అవి ఆశ్చర్యకరంగా గ్లో అవుతూ అందరి చేత వావ్ అనిపించాయి.

మెరుస్తున్న చేపలను సృష్టించడం వెనక ఉద్దేశ్యం సౌందర్య కారణాల కోసం మాత్రమే కాదు, శాస్త్రీయ, ఎన్విరాన్‌మెంటల్ అప్లికేషన్స్ కోసం కూడా.ఉదాహరణకు, ఈ మెరుస్తున్న కార్ప్‌లను నీటి వనరులలో కాలుష్య స్థాయిలను గుర్తించడానికి ఎన్విరాన్‌మెంటల్ సెన్సార్లుగా ఉపయోగించవచ్చు.వాటి గ్లో తీవ్రత కాలుష్య కారకాల ఉనికిని, గాఢతను సూచిస్తుంది, నీటి నాణ్యతను అంచనా వేయడానికి విజువల్ ఇండెక్స్ కూడా అందిస్తుంది.

అంతేకాకుండా, జీవులలోని కణాల ప్రవర్తన, కదలికలను ట్రాక్ చేయడానికి, సంక్లిష్ట జీవ ప్రక్రియలు, వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి ఈ సాంకేతికతను వైద్య పరిశోధనలో అన్వయించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube