పోలీసులను మోసగించిన కేటుగాడు.. అసలు విషయం తెలిసి పోలీసులే షాక్..!

ఇటీవలే కాలంలో కష్టపడకుండా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలి అనుకునే వారంతా చెడు మార్గాల ద్వారానే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు.అందుకే సమాజంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి.

 The Man Who Cheated The Police The Police Were Shocked To Know The Real Thing ,-TeluguStop.com

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల మధ్య మనమంతా జీవిస్తున్నాం.ఇలాంటి కోవకు చెందిన ఒక యువకుడు తన మాయ మాటలతో పోలీసులనే మోసగించి చివరికి అడ్డంగా దొరికిపోయి జైలు పాలు అయినా ఘటన హైదరాబాద్ ( Hyderabad )లో చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

Telugu Bhuvanagiri, Hyderabad, Jubilee Hills-Latest News - Telugu

హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఓ వ్యక్తి ఈనెల ఏడవ తేదీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ( Jubilee Hills Police Station )కు వెళ్లి తాను బ్రెజిల్ నుంచి హైదరాబాద్ కు పర్యటన కోసం వస్తే తన పర్సు తో పాటు ల్యాప్ టాప్ చోరీ అయిందని ఫిర్యాదు చేశాడు.అతనిని చూస్తే విదేశీయుడు లాగానే కనిపించడం, మాట తీరు కూడా అలాగే ఉండడంతో పోలీసులు నిజమే అని నమ్మి ఆ వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెళ్లి ఒక రోజంతా ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ల ద్వారా వెతికారు.

ఎలాంటి క్లూ దొరకలేదు.ఆ వ్యక్తి తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేవంటే పోలీసులు రూ.500 ఇచ్చి పంపించారు.

Telugu Bhuvanagiri, Hyderabad, Jubilee Hills-Latest News - Telugu

మరుసటి రోజు ఆ వ్యక్తి భువనగిరి పోలీస్ స్టేషన్ ( Bhuvanagiri Police Station )కు వెళ్లి తాను అమెరికా నుంచి వచ్చానని తన పర్సు తో పాటు ల్యాప్ టాప్ చోరీ అయిందని ఫిర్యాదు చేశాడు.పోలీసులు సదరు వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెళ్లి చుట్టుపక్కల ఉండే సీసీటీవీలలో పరిశీలించారు.ఎలాంటి ఆచూకీ లభించలేదు.ఆ వ్యక్తి తన వద్ద తినడానికి డబ్బులు లేవని చెప్పడంతో పోలీసులు రూ.1500 ఇచ్చి పంపించారు.ఆ వ్యక్తి 9వ తేదీ మధుర నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇదే విధంగా ఫిర్యాదు చేస్తే వారు కూడా అంతా గాలించి చివరికి డబ్బులు లేవని చెప్పడంతో రూ.1000 ఇచ్చి పంపించారు.అయితే పోలీసులు ఆ యువకుడి గురించి ఆరా తీయగా అతను గోవాకు చెందిన సెబీ డిసిల్వా గా గుర్తించారు.పోలీసులు ఇంకాస్త లోతుగా విచారణ చేయగా ఇతను రాజస్థాన్, బీహార్, గోవాలో మోసాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు.

ఈ విషయాలు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube