ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ టైటిల్ ని తృటిలో భారత్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే.అయితే భారత జట్టు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ టైటిల్ కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉంది.
అయితే వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టులో అంతా జూనియర్లే ఉండే అవకాశం ఉంది.సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ముఖ్యంగా భారత జట్టు స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ( Virat Kohli, Rohit Sharma ) లు టీ20 వరల్డ్ కప్ లో ఆడడం డౌటే.
ప్రస్తుతం టీ20 మ్యాచ్లు ఆడే భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.హార్థిక్ పాండ్యా కు గాయం కావడంతో సూర్యకు కెప్టెన్ అవకాశం వచ్చింది.అవకాశం వస్తే ఎవరైనా గుర్తింపు పొందాలనే ప్రయత్నిస్తారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత జట్టు సూర్య కెప్టెన్సీలో 4-1 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది.ఇక టీంఇండియా, దక్షిణాఫ్రికా టూర్ వెళ్లనుంది.టీ20 సిరీస్ ఆడే జట్టుకు సూర్య కుమార్ యాదవ్ సారధిగా వ్యవహరించనున్నాడు.టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నారు.ఇక మ్యాచ్ చివర్లో ఫినిషర్ గా రింకూ సింగ్ ( Rinku Singh )అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రి( South Africa )కా తో జరిగే టీ20 సిరీస్ లో ఈ జూనియర్ ఆటగాళ్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించి టైటిల్ కైవసం చేసుకుంటే. టీ20 వరల్డ్ కప్ ఆడే ప్రపంచ కప్ కు కోహ్లీ, రోహిత్ దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.