ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయాలలో వరల్డ్ కప్ లో టీం ఇండియా ఓటమిపాలవ్వడం కూడా ఒకటి.ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.దీంతో అప్పటినుంచి ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు.2003 నాటి పరిస్థితి మళ్లీ రిపీట్ అవ్వడంతో భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు.కాగా ఈ సినిమా ఈ మ్యాచ్ ని సినిమా సెలబ్రిటీలు కూడా ప్రత్యక్షంగా స్టేడియం నుంచి వీక్షించిన విషయం తెలిసిందే.
అందులో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.ఆయన చాలా వరకు క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించారు.ఇది ఇలా ఉంటే తాజాగా టీం ఇండియా ఓటమిపై వెంకటేష్ స్పందించారు.వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా నుంచి రాంగ్ యూసేజ్ అనే పాటను విడుదల చేశారు.వీఎన్‌ఆర్, వీజేఐఈటీ కాలేజ్‌లో ఈ పాట విడుదల కార్యక్రమం జరిగింది.
ఇందులో హీరో వెంకటేష్ ( Venkatesh )పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొదట ఆయన టీమిండియా క్రికెట్ జట్టుపై ఆయన ప్రశంసలు కురిపించారు.
వరల్డ్ కప్ మిస్ అయినప్పటికీ భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది.ప్రారంభం నుంచి అద్భుతంగా ఆడింది.కప్ రాకపోయినా అంతకంటే బాగా టీమిండియా( Team India ) క్రికెటర్లు మంచి ప్రదర్శన ఇచ్చారని చెప్పారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, షష్మి, బూమ్రా, శ్రేయాష్, సూర్యకుమార్ ఇలా అందరికి ఆయన అభినందనలు తెలిపారు.అద్భుతంగా ఆడారని ఖితాబిచ్చారు.అంతేకాదు స్టూడెంట్స్ చేత వారికి క్లాప్స్ కొట్టించారు వెంకీ.ఇప్పుడు మిస్ అయినా, నెక్ట్స్ వరల్డ్ కప్ మనదే పక్కా అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ స్టూడెంట్స్ లో ఎనర్జీని తీసుకొచ్చారు.
అనంతరం సైంధవ్ సినిమా( Saindhav movie ) గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.