రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ పాలనలో వెనుకబడిపోయిందని అన్నారు.ఆనాడు తెలంగాణ ఉద్యమం అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రజాస్వామికవాదులు చేశారని కానీ నేడు కేసీఆర్ తనొక్కడే చేశాడని గొప్పలు చెప్పుకోవడం చూస్తే విడ్డురంగా ఉందన్నారు.
నీళ్లు నిధులు నియామకల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబానికి తప్ప సామాన్య ప్రజలకు నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని అన్నారు.
నీళ్ల పేరు చెప్పి కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి వేలకోట్లు దోచుకున్నారని దానికి నిదర్శనం మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడమే అన్నారు.
అధికారంలోకి వచ్చిన కెసిఆర్ కు అహంకారం పెరిగిపోయిందని సామాన్య ప్రజలను కూడా కలవడం కష్టంగా ఉంటూ తను ఒక నియంతల వ్యవహరిస్తున్నారని అన్నారు.తను నియంత పాలనను చూసి విసిగి పోయారని అన్నారు.
గద్దె దించే సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.నిన్నటి రోజు వేములవాడలో కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడ దత్తత తీసుకున్న అని చెప్పేసి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.
గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇప్పుడొచ్చి దత్తత తీసుకుంటానంటే ఇన్ని రోజులు వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిందని నీకు మీకు మీరే చెబుతున్నారని అన్నారు.వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్వకేట్ చేయడం చాలా సంతోషదాయకమని అందుబాటులో ఉండే వ్యక్తిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు.
మీ బిడ్డను మీ పేద బిడ్డను నాలుగు సార్లు ఓడిన ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తిని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా పేరుపేరునా కోరడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పిట్టల మనోహర్,అవధూత రజనీకాంత్, నరాల శ్రీనివాస్, పుప్పాల భాను కృష్ణ, కర్ల శ్రీకాంత్, జెట్టి శేఖర్, దాసరి శ్రీనివాస్, గుండవేని రవీందర్, కోయాల్కర్ శశి,
పూర్ణం శెట్టి నాగరాజు, కద్దుల తిరుపతి, సుంకరనేని వంశీకృష్ణ, శ్యామ ప్రశాంత, మొగిలి సుజాత, పిట్టల వెంకటేష్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమరయ్య చిలుక రమేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, బొందిలా మహేష్, వలి, కనికరపు రాకేష్, ముప్పిడి శ్రీధర్, కొలకాని రాజు నేరెళ్ల శ్రీధర్, తుమ్మ్ మధు గుర్రం తిరుపతి, వస్తాది కృష్ణ ,నాగుల రాము, తోట లహరి, అరుణ్ తేజ చారి, సాయిని అంజయ్య, వరిజే మల్లేశం, తదితరులు ఉన్నారు.