తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అయ్యింది.తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను హైలెట్ చేసుకుంటూనే ప్రత్యర్థుల పైన తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు .
ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్ మద్య ఈ విమర్శల పర్వం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కరెంట్ వార్ ఈ రెండు పార్టీల మాటల యుద్ధం మరింత తీవ్రతరం అయ్యేలా చేస్తోంది.
ముఖ్యంగా ఉచిత విద్యుత్ అంశం ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన అంశంగా మారింది.ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి కేవలం ఐదు గంటలు మాత్రమే ఇస్తుందని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, కర్ణాటక కాంగ్రెస్ నేత , ఉప ముఖ్యమంత్రి డి.
కె శివకుమార్( Dk shivakumar ) సైతం 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు .దీంతో బిఆర్ఎస్ మరింతగా ఈ అంశంపై విమర్శలు చేస్తుంది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య ఉచిత కరెంటు , ఆరు గ్యారంటీ ల డిక్లరేషన్ పైనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్( Free Power ) ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.అంతేకాదు కేసీఆర్ ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు.తమకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వనందుకు నిరసనగా కర్ణాటకకు చెందిన కొంతమంది రైతులు ఇటీవల తాండూరులో నిరసన కూడా తెలిపారు .కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని కేసీఆర్ కోరుతున్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదని, కర్ణాటకలో కరెంటు తీగలు పట్టుకుని 19 గంటలు నిలబడడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సవాల్ చేశారు.
బీఆర్ఎస్ ఆరోపణలను నిజం చేసే విధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తాండూరు సభలో తమ రాష్ట్రంలో రైతులకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు.తాము హామీ ఇచ్చినట్లుగా 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం లేదని ఆయన అంగీకరించారు.
ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కర్ణాటక కు చెందిన రైతులు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఆందోళనకు దిగారు.
గద్వాల, కొడంగల్ పరిగి , నారాయణఖేడ్ లో కర్ణాటక రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు .తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే కరెంటు ఇస్తుందని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని అక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు.తెలంగాణ ప్రజలు మోసపోవద్దని నినాదాలు చేశారు.
ఈ అంశాలను మరింత హైలెట్ చేసిన బీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కర్ణాటక వైఫల్యాలను హైలెట్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఇదే పరిస్థితి వస్తుందని విమర్శలు చేస్తోంది.