ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్నవారు, ఇదివరకు డైరెక్టర్ లుగా ఉన్న చాలామంది మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ను మొదలుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు.అటువంటి వారిలో డైరెక్టర్ బి.
గోపాల్( Director B Gopal ) కూడా ఒకరు.ఈయన మొదట పి.సి.రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు.రాఘవేంద్రరావు తెరకెక్కించిన దాదాపు 12 సినిమాలకు బి.గోపాల్ పని చేశారు.ఈ సమయంలోనే దగ్గుబాటి రామా నాయుడు( Ramanaidu ) ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి తన బ్యానర్‌లో దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చారు.
అలా మొదట ప్రతిధ్వని సినిమాతో ఈయన దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, అల్లరి రాముడు, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.బొబ్బిలి రాజా సినిమాతో పాటు గ్లామర్ హీరోయిన్ గా దివ్య భారతికి( Divya Bharathi ) బాగా పేరొచ్చింది.
అలా ఆమెను అసెంబ్లీ రౌడీ మూవీలోకి( Assembly Rowdy ) తీసుకున్నాము.కానీ ఈ మూవీలో ఒకే ఒక గ్లామర్ సీన్ ఉంటుంది.
తీరా ఆ గ్లామర్ సన్నివేశం షూటింగ్ తీసే రోజు దివ్యభారతి ఇంకా రాలేదు.
మోహన్ బాబు గారు( Mohan Babu ) ఏమైంది? ఇంకా ఎంతసేపు ఆలస్యం చేస్తారు? అని కోప్పడుతున్నారు.తను రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే దివ్య భారతి ఏడుస్తోంది.షూటింగ్‌కే రానంటోంది.
ఆ డ్రెస్ వేసుకోను అంటోంది అని చెప్పారు.అమ్మాయేమో రానంటోంది షూట్ క్యాన్సిల్ అంటే మోహన్‌బాబు అరిచేస్తారు.
ఏం చేయాలా? అని నేనే దివ్య భారతి దగ్గరకు వెళ్లాను.వెళ్లేసరికి ఆమె నిజంగానే ఏడుస్తోంది.
తను ఆ డ్రెస్ వేసుకోను అని చెప్పింది.దీంతో ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాను.అది విని దివ్య భారతి తల్లి తన కూతురిని ఒప్పించింది.వెంటనే ఆమె ఐదు నిమిషాల్లో రెడీ అయింది.సీన్ కూడా షూట్ చేసేశాము.సినిమాలో ఈ సీన్ బాగా క్లిక్ అయింది అని దర్శకుడు బి.గోపాల్ చెప్పుకొచ్చారు.