సివిల్స్ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు డాక్టర్ గా పని చేసిన దీప్తి చౌహాన్ సివిల్స్ ర్యాంకర్ గా సత్తా చాటడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన దీప్తి చౌహాన్ సివిల్స్ పరీక్షలో 630వ ర్యాంక్ సాధించడం గమనార్హం.రెండుసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా మూడో ప్రయత్నంలో దీప్తి చౌహాన్( Deepti Chauhan ) కోరుకున్న సక్సెస్ దక్కడం గమనార్హం.
అదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన దీప్తి చౌహాన్ కొంతకాలం డాక్టర్ గా పని చేసి 2019 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.దీప్తి అమ్మమ్మ స్వస్థలం నిజామాబాద్ ( Nizamabad )కాగా ఈమె మేనమామ వెంకటయ్య ఆర్డీవోగా పని చేశారు.
కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో సివిల్స్ కు ప్రిపేర్ అయిన దీప్తి లక్షలాది మంది ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో సివిల్స్ దిశగా అడుగులు వేయడం గమనార్హం.
ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ వస్తుందని దీప్తి చౌహాన్ భావిస్తున్నారు.మామయ్య వల్ల సేవ చేయాలనే ఆలోచన కలిగిందని వరుసగా రెండుసార్లు విఫలమైనా మూడో ప్రయత్నంలో అనుకూల ఫలితాలు రావడం సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.రిటైర్డ్ ఆర్డీవో వెంకటయ్య( Retired RDO Venkataiah ) మాట్లాడుతూ మా కోడలు ఎప్పటికైనా సివిల్స్ లో ర్యాంక్ సాధిస్తుందని నమ్మకం ఉండేదని కామెంట్లు చేశారు.
దీప్తి చౌహాన్ తన లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లక్ష్యాన్ని సాధించడం కొరకు దీప్తి పడిన కష్టం అంతాఇంతా కాదని వెంకటయ్య వెల్లడించారు.
ఇష్టమైన వైద్య రంగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ దిశగా దీప్తి అడుగులు వేశారని ఆయన అన్నారు.దీప్తి చౌహాన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఫిదా చేస్తోంది.
రాబోయే రోజుల్లో దీప్తి మరిన్ని విజయాలను అందుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.