Priyanka Arul Mohan: శివ కార్తికేయన్ తో చేసిన తప్పు వల్లే నేను లావుగా మారాను.. నాని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Arul Mohan ).నాని హీరోగా వచ్చిన నాని’స్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

 Actress Priyanka Arul Mohan Sensational Comments About Shiva Karthikeyan-TeluguStop.com

ప్రియాంక మోహన్ కేవలం నాని మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ఓజీ ( OG ) లో కూడా అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమా( Captain Millaer )లో కూడా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేసింది.

అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా నానితో కలిసి సరిపోదా శనివారం( Saripodhaa Shanivaram ) అనే సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసింది.ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి.

Telugu Miller, Dhanush, Don, Nani, Nani Gang, Og, Pawan Kalyan, Priyankaarul, Md

అయితే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంక అరుల్ మోహన్ కాస్త లావుగా కనిపించేసరికి సోషల్ మీడియాలో ఈమె పై ట్రోల్స్ వచ్చాయి.అయితే ఈ విషయంపై స్పందించిన ప్రియాంక అరుల్ మోహన్ నేను ఇలా లావుగా అవ్వడానికి కారణం శివ కార్తికేయ్ అని చెప్పకనే చెప్పేసింది.ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ.శివ కార్తికేయన్ తో కలిసి నేను డాక్టర్ (Doctor movie) మరియు డాన్ అనే రెండు సినిమాల్లో నటించాను.

అయితే శివ కార్తికేయన్ ( Shiva Karthikeyan ) ఎక్కువగా స్వీట్స్ తింటూ ఉంటారు.ఇక అలా స్వీట్స్ ఆయన మాత్రమే కాకుండా ఆయన పక్కన ఉన్న వాళ్లకు కూడా స్వీట్స్( Sweets) బలవంతంగా ఇస్తూ ఉంటారు.

వాళ్ళు వద్దని చెప్పినా కూడా వినరు.ఇక అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా వెయిట్ ఎక్కువగా పెరిగిపోతాను అన్న భయం కూడా లేకుండా స్వీట్స్ తింటూ ఉంటారు అని ప్రియాంక అరుల్ మోహన్ చెప్పుకొచ్చింది.

Telugu Miller, Dhanush, Don, Nani, Nani Gang, Og, Pawan Kalyan, Priyankaarul, Md

అయితే ప్రియాంక అరుల్ మోహన్ ( Priyanka Arul Mohan ) పరోక్షంగా తాను బరువు పెరగడానికి కారణం శివ కార్తికేయన్ తనతో బలవంతంగా స్వీట్లు తినిపించడమే అని ఆమె మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది.ప్రస్తుతం ప్రియాంక మోహన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయి వరుస సినిమాలకు కమిట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube