వీడియో: ఈ యువకుడు సూపర్ టాలెంటెడ్.. సైకిల్‌ను ఎలా రైడ్ చేస్తున్నాడో !!

సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను చూపుతూ అందరిని అబ్బుర పరుస్తుంటారు.వారి ప్రతిభను చూస్తే మనం కుళ్ళుకోక తప్పదు.

 Man Stunts With Cycle In Traffic Video Viral On Social Media Details, Viral Vide-TeluguStop.com

తాజాగా అలాంటి సూపర్ టాలెంటెడ్ యువకుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) చక్కర్లు కొడుతోంది.

ఆ వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనకు ఒక యువకుడు సైకిల్‌పై( Cycle ) దూసుకెళ్లడం కనిపిస్తుంది.

అతడు కార్ల సందులలో నుంచి సైకిల్ పై వెళుతూ ఉంటాడు.అందరిలాగా కాకుండా అతడు సైకిల్ ముందు చక్రాన్ని పైకి లేపి ఒక్క చక్రం పైనే నడుపుతుంటాడు.

అలా నడుపుతూ కార్లకు చాలా దగ్గరగా వెళ్లి కటింగ్ ఇస్తాడు.ఆ కార్లన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి.వాటి పక్కనుంచి ఇతడు స్టంట్స్( Stunts ) చేసుకుంటూ ఏదో గేమ్ లో వెళ్లినట్లు వెళ్తాడు.ఒకానొక సమయంలో అతడు కారుకు చాలా దగ్గరగా వెళ్లి కటింగ్ ఇస్తాడు.

ఆ సమయంలో అతడు దానికి డ్యాష్ ఇస్తాడేమో అనిపిస్తుంది.కానీ అది జరగదు.

ఈ వీడియో పై “బాబీ స్మూత్ గ్రౌండ్ వర్క్” అనే ఒక పేరు కనిపిస్తుంది.ఆ పేరుకి ఇతడు సరిగ్గా సూట్ అవుతాడు.ఎందుకంటే గ్రౌండ్ పై అతడు సైకిల్ నడుపుతున్న తీరు చాలా స్మూత్ గా ఉంది.అతడు సైకిల్ పై తీసుకునే టర్నింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.ఈ వీడియో చూస్తుంటే సైకిల్ రైడింగ్ స్కిల్స్( Cycle Riding Skills ) పెంచుకునేందుకు అతడు బాగా సాధన చేసినట్లు కనిపిస్తోంది.అందుకే అంత బాగా దానిని రైడ్ చేస్తున్నాడు.

ఒంటి చక్రం పై నడపడం అంటే ఆషామాషీ విషయం కాదు.అందుకే ఇతడి ప్రతిభను చాలామంది మెచ్చుకుంటున్నారు.

నైపుణ్యమా, తెలివి తక్కువతనమా? అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.అయితే ఇది కంప్లీట్ గా స్కిల్స్ అని దాంట్లో స్టుపిడిటీ ఏం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.దీనికి ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube