ఆ నాయకురాలిని నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆ మహిళా నాయకురాలికి మాట ఇచ్చి నట్టేట ముంచేసారు అంటూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు,కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి.అంతేకాదు ఆ మహిళ నాయకురాలికి మాట ఇచ్చి మోసం చేశారని మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

 Revanth Reddy Promised Palvai Sravanti Minister Seat And Cheated Details, Revant-TeluguStop.com

మరి ఇంతకీ టీపిసిసి రేవంత్ రెడ్డి ఏ నాయకురాలికి మాట ఇచ్చి తప్పారు.ఎందుకు అలా చేయవలసి వచ్చింది అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

మునుగోడులో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లి అక్కడ ఉప ఎన్నిక వచ్చేలా చేశారు.

ఇక ఉప ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే గా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు.

అక్కడ కాంగ్రెస్, బిజెపి ఓడిపోయి చివరికి బీఆర్ఎస్ గెలిచింది.అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) ఉప ఎన్నికల్లో నిలిచింది.

ఆ సమయంలో ప్రచారం చేయడానికి వచ్చిన టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దాదాపు 15 మంది మహిళ నాయకురాళ్ళకి టికెట్లు ఇస్తామని, అందులో నలుగురికి మంత్రి పదవి ఇస్తామని, ఇక అందులో ఒకరు మా సోదరీమణి పాల్వాయి స్రవంతికి కచ్చితంగా ఉంటుంది అని మాట ఇచ్చారు.

Telugu Congress, Komatiraj, Munugode, Palvaisravanthi, Palvai Sravanti, Revanth

అయితే ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో కనీసం రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా పాల్వాయి స్రవంతికి ఇవ్వలేదు.ఎన్నో రోజుల నుండి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ (Congress) కి పేరు లేకపోవడంతో బీజేపీలోకి( BJP ) జంప్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ కి పేరు రావడంతో పార్టీలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీటు ఇచ్చారు.ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది.

ఈ విషయంలో టిపిసిసి రేవంత్ రెడ్డి పాల్వాయి స్రవంతికి మాట ఇచ్చి తప్పారు అంటూ కొంతమంది నెటిజన్స్ అప్పటి వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం పట్ల పాల్వాయి స్రవంతి వర్గంతో పాటు చల్లమల కృష్ణారెడ్డి (Challamala Krishna Reddy) కూడా అసంతృప్తితో ఉన్నారట.

Telugu Congress, Komatiraj, Munugode, Palvaisravanthi, Palvai Sravanti, Revanth

అయితే గత కొన్ని రోజులుగా పాల్వాయి స్రవంతి చల్లమల కృష్ణారెడ్డి ఇద్దరు ఎవరికి వారే మునుగోడులో ప్రచారం చేస్తూ తమకు టికెట్ వస్తుంది అని ఆశించారు.కానీ అనూహ్యంగా బిజెపి (BJP) నుండి కాంగ్రెస్ కి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఈ ఇద్దరు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.ఇక ఈరోజు చల్లమల కృష్ణారెడ్డి తన కార్యకర్తలతో భేటీ అయి వేరే పార్టీలోకి వెళ్లడమా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube