బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆయన మళ్లీ సొంత గూటికే చేరనున్నారు.

 Komatireddy Rajagopal Reddy Resigns From Bjp-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 27న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరో ఐదు వారాల్లో కేసీఆర్ పాలన అంతం కాబోతుందన్నారు.బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని అందులో చేరానన్న కోమటిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

అయితే గతంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన కోమటిరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నారు.కాగా వచ్చే ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube