వన్డే వరల్డ్ కప్ లో జరుగుతున్న ప్రతి మ్యాచ్లో పాత రికార్డులు బ్రేక్ అవుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.ఈ టోర్నీలో పసికూన జట్లను తక్కువ అంచనా వేసిన జట్లన్నీ చిత్తుగా ఓటమిని చవి చూస్తున్నాయి.
ఏ టోర్నీలో సాధ్యం కానీ రికార్డులు ఈ టోర్నీలో క్రియేట్ అవుతూ ఉండడం గమనార్హం.బంగ్లాదేశ్( Bangladesh ) తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా( South Africa ) ఆటగాడైనా క్వింటన్ డి కాక్( Quinton de Kock ) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో, టోర్నీలో మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు.
దీంతో అంతర్జాతీయ వన్డే వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతమైన 20 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ( Rohit Sharma ), AB డివిలియర్స్ పేర్లపై ఉండే రికార్డులను క్వింటన్ డి కాక్ తాజాగా బద్దలు కొట్టాడు.తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో క్వింటన్ డి కాక్ 101 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ చేశాడు.మొత్తం 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు.
వన్డే ఇంటర్నేషనల్ లో అత్యంత వేగంగా 20 సెంచరీలు పూర్తి చేసిన క్రికెట్ దిగ్గజాల జాబితాలో క్వింటన్ డి కాక్ ( Quinton de Kock )పేరు కూడా చేరింది.సచిన్ టెండుల్కర్ 197 వన్డే ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు చేస్తే.రోహిత్ శర్మ 183 ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు పూర్తి చేశాడు.
క్వింటన్ డి కాక్ కేవలం 175 ఇన్నింగ్స్ లలోనే 20 సెంచరీలు పూర్తి చేశాడు.దక్షిణాఫ్రికా దిగ్గజం హాషీమ్ ఆమ్లా 108 ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ 133 వన్డే ఇన్నింగ్స్ లలో 20 ఉండే సెంచరీలు పూర్తి చేసి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆస్ట్రేలియా ఆటగాడైన డేవిడ్ వార్నర్( David Warner ) 142 ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు చేసి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
తాజాగా ఈ జాబితాలో నాలుగవ స్థానంలో క్వింటన్ డి కాక్ చేరాడు