Relangi Venkatramaiah : రేలంగి కొత్త‌కారుకి, మహానటి సావిత్రి డ్రైవ‌ర్ కి వున్న అవినాభావ సంబంధం ఇదే!

హాస్య న‌టుడు రేలంగి వెంక‌ట్రామ‌య్య( Relangi Venkatramaiah ) గురించి నిన్న మొన్నటి తరానికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అయితే నేటి త‌రానికి కాస్త తెలియదనే చెప్పుకోవాలి.

 Savitri Driver Relation With Relangi Tollywood-TeluguStop.com

ఆయ‌న అప్పట్లోనే హీరోల‌తో స‌మానంగా పారితోషికం తీసుకున్నారనే పేరు వుండేది.ఈ క్రమంలో సినీ ప్ర‌పంచంలో అన్ని అనుభ‌వాల‌ను ఆయ‌న అనుభవించారు.

కాగా 24 కళల మీద ఆయ‌నకు మంచి అభిరుచి వుండేది.ఆయన సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం చేయకపోయినా త‌న పాత్ర‌ల‌కు తానే దర్శకత్వం వహించేవాడు.

ముఖ్యంగా మేక‌ప్ విష‌యంలో.రేలంగికి ఎవ‌రి సాయం తీసుకొనేవాడు కాదట.

అసిస్టెంట్ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర పాత్ర గురించి తెలుసుకొని త‌నే వెళ్లి నేరుగా మేక‌ప్ వేసుకునేవారట.ఇదే విష‌యం ఎల్వీ ప్ర‌సాద్ అనేక సంద‌ర్భాల్లో చెప్పేవారు.

రేలంగి ఉంటే… మేక‌ప్‌మ్యాన్ అవ‌స‌రం లేదు.ఆ ఖ‌ర్చు మాకు మిగిలేద‌ని అనేవారట సరదాగా.

Telugu Prasad, Car, Ranga Rao, Savitri, Tollywood-Movie

అంతేకాదండోయ్… నిర్మాత‌ల‌కు ఎక్క‌డ ఖ‌ర్చు త‌గ్గించుకోవాలో చెప్పేవారని వినికిడి.అందుకే అతనికి చాలా మంచి పేరు వుండేది.ఇక సినిమాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న రేలంగి.రెమ్యున‌రేష‌న్‌గా వ‌చ్చిన సొమ్ముతో కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసేవారు.ఆయనకి కార్లు అంటే చాలా మోజు వుండేదట.ఏ కారునైనా ఆయ‌న రెండేళ్ల‌కు మించి వాడేవారు కాదని వినికిడి.

అప్ప‌ట్లో విదేశీ కార్లు.కొనుగోలు చేయ‌డంలో ఎస్వీ రంగారావు, సావిత్రిల( S V Ranga Rao ) మ‌ధ్య పోటీ ఉండేదట.

త‌ర్వాత కాలంలో రేలంగి వీరిని మించిపోయారు అని సమాచారం.

Telugu Prasad, Car, Ranga Rao, Savitri, Tollywood-Movie

ఈ క్రమంలో ఆయ‌న ఓ సారి, తాను కొత్త కారు కొన్నాన‌ని.రేపు స్టూడియోకు తీసుకువ‌స్తాన‌ని చెప్పారట.దీంతో మ‌రుస‌టి రోజు రేలంగి తీసుకువ‌చ్చే కారు చూసేందుకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూసారట.

అయితే.కొత్తకారు ఇంటికి వ‌చ్చినా.

దానిని 12 కిలో మీట‌ర్ల దూరంలోని స్టూడియోకు తీసుకురావాలంటే.డ్రైవ‌ర్ అవసరం తప్పనిసరి.

అప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ ఆక‌స్మికంగా అదే రోజు సెలవు పెట్టాడట మరి.త‌న‌కేమో.డ్రైవింగ్ రాకపాయే.దీంతో ఏం చేయాలో రేలంగికి తోచ‌లేదట.ఇక వెంటనే ఓ ఆలోచన రావడంతో మహానటి సావిత్రి( Savitri )కి ఈ విషయం చెప్పారట.దాంతో ఆమె త‌న డ్రైవ‌ర్‌ను రేలంగి కొత్త‌కారుకి ఒక్కరోజు డ్రైవరు గా పంపిందట.

మొత్తానికి తొలి రోజు ముచ్చ‌ట అలా తీరింద‌ని రేలంగి పలుమార్లు ముచ్చటించేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube