ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కాస్త ఆసక్తికరంగానే ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే.చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ( Bandaru Satyanarayana ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం మంత్రి రోజా ( Roja ) పై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
బండారు ఇలా మాట్లాడటంతో ఆయనపై ఏ విధమైనటువంటి విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే.
ఒక మహిళ అలాగే మంత్రి పదవిలో ఉన్నటువంటి రోజా పట్ల బండారు సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే చర్యలు కూడా తీసుకున్నారు.అయితే ఈయన చేసిన వ్యక్తుల పట్ల ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు మహిళా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా విశాఖలో పర్యటించినటువంటి హీరో సుమన్ ( Suman )కు ఇదే ప్రశ్న ఎదురయింది.
ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అంటూ సుమన్ ను ప్రశ్నించడంతో ఆయన స్పందిస్తూ బండారు వ్యాఖ్యలను తప్పు పట్టారు.
మినిస్టర్ రోజాను రాజకీయపరంగా ఎదుర్కో లేకపోవడం వల్లే తనని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని సుమన్ వెల్లడించారు.మంత్రి రోజాని రాజకీయపరంగా ఎదుర్కోవాలని ఈయన సవాల్ విసిరారు.రోజా సినీనటిగా నటిస్తూ ఎంతో కష్టపడి రాజకీయాలలోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నారు.
బండారు సత్యనారాయణ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా వారిని కూడా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా అంటూ సుమన్ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.