అమెరికా అధ్యక్ష ఎన్నికలు : స్వతంత్ర అభ్యర్ధిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ .. ట్రంప్‌కు చిక్కులే, వెలుగులోకి సంచలన సర్వే

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Election 2024 ) సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

 Robert Kennedy's Entry Into Presidential Race Affects Joe Biden, And Donald Trum-TeluguStop.com

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.

ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్‌ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telugu America, Donald Trump, Joe Biden, Mike Pence, Nikki Haley, Robert Kennedy

అధ్యక్ష ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్ధిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ( Robert Kennedy )జూనియర్ దిగడంతో అమెరికన్ రాజకీయాలు వేడెక్కాయి.పోల్స్ ప్రకారం.బైడెన్‌‌తో పోలిస్తే కెన్నెడీ రాకతో ట్రంప్ విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయట.

ఇటీవలి వరకు డెమొక్రాట్‌గా కొనసాగుతున్న రాబర్ట్ గత వారం స్వతంత్ర అభ్యర్ధిగా అధ్యక్ష రేసులోకి వచ్చారు.ఆయన నిర్ణయం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే ఆయనకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి పెద్ద ఎత్తున మద్ధతుదారులు వున్నారు.దీనికి తోడు ఆయన వ్యాక్సిన్‌లకు వ్యతిరేకం, స్వతహాగా న్యాయవాది.

Telugu America, Donald Trump, Joe Biden, Mike Pence, Nikki Haley, Robert Kennedy

ఈ వారం విడుదలైన NPR/PBS NewsHour/Marist National pollలో కెన్నెడీ పార్టీ మార్పు . బైడెన్‌( Joe Biden )తో పోలిస్తే ట్రంప్‌కు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందని తేలింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బైడెన్‌కు 44 శాతం, ట్రంప్‌కు 37 శాతం, కెన్నెడీకి 16 శాతం ఓట్లు వస్తాయని.3 శాతం మంది తటస్థంగా వుంటారని సర్వే వెల్లడించింది.కెన్నెడీ స్వతంత్రంగా బరిలోకి దిగడం వల్ల ట్రంప్ 10 శాతం ఓట్లను కోల్పోతే, బైడెన్‌కు 5 శాతం మాత్రమే నష్టం జరుగుతుందని సర్వే అభిప్రాయపడింది.రిపబ్లికన్ ఓటర్లకు సంబంధించి ‘‘బెంజింగా’’ ట్రాక్ చేసే తాజా మార్నింగ్ కన్సల్ట్ పోల్ ప్రకారం రిపబ్లికన్‌లలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఆధిక్యంలో వున్నారు.

కానీ ప్రస్తుతం ఆయనకు మద్ధతు తగ్గుతోందని సర్వే వెల్లడించింది.ఈ వారం పోల్‌లో ట్రంప్‌కు 59 శాతం ఓట్లు రాగా.అది మునుపటి వారం 61 శాతంగా వుంది.ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ( Ron DeSantis )12 నుంచి 14 శాతానికి ఎగబాగారు.

నిక్కీ హేలీ, మైక్ పెన్స్‌లకు కూడా ఒక శాతం మేర ఓట్లు పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube