ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాఫ్ వాట్సాప్( WhatsApp ) లేనిదే ఇపుడు ఏపని జరగడంలేదు.టెక్స్ట్ మెసేజ్‌ల నుంచి వీడియో కాల్స్ వరకు దీన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వినియోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసినదే.
ఎందుకంటే అందులో మనమూ వున్నాం కాబట్టి.అయితే అలాంటి సేవలు అందిస్తున్న వాట్సప్ త్వరలో కొందరు ఉపయోగించలేరు.
ఎందుకంటే కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనుంది.వాట్సాప్ రీసెంట్ టైమ్‌లో మరింత అడ్వాన్స్‌డ్ ఫోన్లు, సాఫ్ట్‌వేర్‌లలోనే పని చేసే కొత్త ప్రైవసీ ఫీచర్లను లాంచ్ చేసింది.
అందుకే ఆండ్రాయిడ్ 4.1( Android 4.1 ) లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న పాత ఫోన్లలో ఈ ఫీచర్లు వర్క్ అవ్వవు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఒకవేళ వాడినా ఓల్డ్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించే వారికి సెక్యూరిటీ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.
ఆ కారణంగా అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్ ఈ ఫోన్లకు సపోర్ట్ అందించడాన్ని నిలిపియాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే కొత్త OSలకు అప్‌గ్రేడ్ కావాలని వాట్సాప్ తన వినియోగదారులకు సూచించింది.
ఇపుడు గడువు తర్వాత వాట్సాప్ సపోర్ట్ ను కోల్పోయే కొన్ని ఓల్డ్ ఫోన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ లిస్టులో “శామ్‌సంగ్ గెలాక్సీ S2”( Samsung Galaxy S2 ) వుంది.ఇది 2011లో శామ్‌సంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్.ఇందులో వర్క్ చేయదు.తరువాత “HTC వన్” ఈ లిస్టులో వుంది.2013లో విడుదలైన ప్రీమియం ఫోన్ ఇది .ఇక మూడవది “సోనీ ఎక్స్‌పీరియా Z.”( Sony Xperia Z ) ఇది 2013లో సోనీకి చెందిన వాటర్‌ప్రూఫ్ ఫోన్.దీనిని మీరు వాడుతున్నాట్టైతే వెంటనే మార్చుకోవడం ఉత్తమం.అదేవిధంగా “ఎల్‌జీ ఆప్టిమస్ G ప్రో” కూడా ఇకనుండి వాట్సప్ సపోర్ట్ చేయదు అని భోగట్టా.ఇంకా ఈ లిస్టులో HTC సెన్సేషన్, శామ్‌సంగ్ గెలాక్సీ S, HTC డిజైర్ HD, మోటారోలా Xoom, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1, నెక్సస్ 7 వంటి మోడల్స్ లో వాట్సప్ వర్క్ చేయదు.ఈ ఫోన్లు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందలేనంత పాతవి అయ్యాయి కాబట్టి వాట్సాప్ సపోర్టును కోల్పోతున్నాయి.