కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిద్ధార్థ్ ( Siddharth ) ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారా అయితే ఈ మధ్యకాలంలో ఈయనకు అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా సినిమాలను తగ్గించేసారని చెప్పాలి.ఇక చాలా రోజుల తర్వాత ఈయన చిన్నా( Chinna ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తమిళంలో విడుదలయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇకపోతే ఈ సినిమాకు స్వయంగా సిద్ధార్థ్ నిర్మాత కావటం విశేషం.
ఇలా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని తెలుగు కన్నడ మలయాళ భాషలలో కూడా తిరిగి డబ్ చేసే విడుదల చేశారు ఇక్కడ కూడా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుందని చెప్పాలి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాని తెలుగులో డబ్ చేయకుండా రీమేక్ చేయాలి అని సిద్ధార్థ్ భావించారట ఇలా తమిళంలో తాను నటించిన ఈ సినిమాని తెలుగులో నాచురల్ స్టార్ నాని( Nani )!తో రీమేక్ చేస్తే బాగుంటుందని సిద్ధార్థ్ భావించి ఈ విషయం గురించి నానితో కూడా మాట్లాడారని తెలుస్తుంది.
ఇలా తన నిర్మాణంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా కావడంతో తెలుగులో ఈ సినిమాని నాని చేత రీమేక్ చేయించాలని సిద్ధార్థ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పాలి.అప్పటికే నాని దసరా సినిమా( Dasara Movie ) షూటింగ్ పనులకు కమిట్ అయ్యి ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయడానికి ఏమాత్రం కాల్ షీట్స్ లేకపోవడంతోనే ఈ సినిమా వదులుకున్నారని తెలుస్తుంది.లేకపోతే ఈ సినిమాలో నాని ( Nani )నటించాల్సి ఉండేదని సమాచారం.ఇక ఈ సినిమాలో నిజంగానే నాని కనుక నటించి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ లో హిట్ అయి ఉండేది అంటూ పలువురు ఈ వార్తలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
.