జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) డాక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలు చెల్లింపులకు బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.

 Dharna Of Mid Day Workers In Front Of District Collectorate-TeluguStop.com

కొత్త మెనుకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలన్నారు.జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలను ఏరియర్స్ తో సహా చెల్లించాలనీ,గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి అన్నారు.

వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు.కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలనీ,సామాజిక భద్రత కల్పించాలన్నారు.మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా( Accident insurance ), పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనీ, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు అందజేయాలన్నారు.పలు డిమాండ్లతో మండల రెవెన్యూ అధికారి కి సమ్మె నోటీసులు అందజేయడం జరిగిందనీ తెలిపారు .ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, ఎల్లారెడ్డి, సిఐటియు( CITU ) జిల్లా నాయకులు మోరా అజయ్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుద్దాల ఉపసర్పంచ్, ఎర్రవెల్లి నాగరాజు, సావన్ పెళ్లి రాములు,మధ్యాహ్న భోజన కార్మికులు మేకల కవిత, గొట్టే బాలామణి, మెర్గు బాబాయ్, జంగం దేవవ్వ, వంగపల్లి వెంకటలక్ష్మి, గడ్డం పద్మ, తాళ్లపల్లి లావణ్య, తాళ్ల పెళ్లి సుజాత, మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube