బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లో చాలా రోజులుగా జనాలను కనివిందు చేయాలని ఉల్టా పుల్ట గేములు ఎన్ని పెట్టినా మాకు మస్తా కొట్టలేరు అంటూ ఉద్యనాలు తిప్పికొడుతూనే ఉన్నారు.రేటింగ్ కోసం వారి దంతాలు వారివి కానీ ఒక్కోసారి బిగ్ బాస్ హౌస్ లోని ఇంటి సభ్యుల ప్రవర్తన కూడా జనాలకు చిరాకు తెప్పిస్తుంది.
మరీ ముఖ్యంగా గత వారం రోజులు అమర్ దీప్ ( Amar Deep )నటన చూడలేక జనాలు చచ్చిపోయారంటే నమ్మండి.మొదటినుంచి శివాజీ పల్లవి ప్రశాంత్ లకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ప్రతి వారం ఏదో రకంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు అమర్ దీప్.
ఈ రకమైన మాటలు అమర్ కి వ్యతిరేకతను సోషల్ మీడియాలో బాగా పెంచుతున్నాయి.మరీ ముఖ్యంగా లెటర్ త్యాగం చేయాలి టాస్క్ లో అతను ఏడుపు చూసిన వారంతా కూడా బీభత్సంగా ట్రోలింగ్ చేస్తూ అమర్ ను ఒక ఆట ఆడిస్తున్నారు.
అమ్మ అనే పేరు చెప్తే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటూ అతను ఏడ్చిన విధానం కూడా జనాలకు నచ్చలేదు పైగా లెటర్ త్యాగం చేసిన వారే పోటీదారు అవుతాడు అనే భ్రమలోనే అతడు త్యాగం చేశాడు తప్ప అమ్మ కోసం కాదు అంటూ సోషల్ మీడియాలో అందరూ ఒకేసారి రివర్స్ అవడం విశేషం.అంత డ్రామా చేసి అంత ఏడిస్తే చివరికి పోటీదారు అయ్యే అవకాశం కూడా కోల్పోవడంతో నీలా పడిపోయి తను ఇంటికి పనికిరాని అంటూ సింపతీ సంపాదించే చేసే పనిలో పడ్డాడు.పైగా కలర్స్ టాస్క్ లో ఎవరు కలర్ పూయకుండానే తన మొహానికి తానే ఎర్ర రంగు పూసుకొని యుద్ధం ప్రకటించాడు ప్రియాంకపై.
ఓవైపు ఆటలో లేకపోయినా సరే శివాజీని( Shivaji ) మాటలు అంటూ, ఆటలో ఉన్న ప్రశాంత్ ( Prashanth )కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, సంచాలక్ గా వ్యవహరించిన ప్రియాంకను సైతం తన మాటలతో ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడు కానీ ప్రియాంక అతనిని వెళ్లిపో అంట చీదరించుకునే సరికి ఆ వ్యతిరేకతను తీసుకోలేకపోయాడు.కానీ హౌస్ లో ప్రతి చోటా నెగటివ్ పనులు చేస్తూ అందరికీ ఇరిటేట్ చేస్తూ ఎలిమినేషన్ కి దగ్గరకి వెళ్తున్నాడు అమర్ దీప్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.అసలు మీడియాలోనే సీరియల్ బ్యాచ్ కి ఎలాంటి సానుభూతి లేదు పైగా ఇలాంటి ఓవరాక్షన్ చేసి ఇంకింత చెడగొట్టుకుంటున్నారు ఇలాగే జరిగితే మరికొన్ని రోజుల్లో ఇంటికి వెళ్లిపోవడం ఖాయం.