ఇజ్రాయెల్‌ ప్రధానితో మాట్లాడినట్లు స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..!!

ఇజ్రాయెల్‌ పై హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం ఒక్కసారిగా దక్షిణ ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదులు.

కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని సామాన్యులపై దొరికిన సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.ఇదే సమయంలో కొంతమందిని బందీలుగా గాజా ప్రాంతానికి తరలించారు.

దీంతో ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించింది.ఈ క్రమంలో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారీగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది.

ఉగ్రవాదులు తలదాచుకున్న స్థావరాలపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ భారీగా మెరుపు దాడులు చేస్తున్నాయి.దీంతో ఈ యుద్ధంలో భారీగా మృతుల సంఖ్య పెరుగుతోంది.

హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన దాడులలో ఇప్పటివరకు వందమంది చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ లోని టెల్ అవివ్ వెల్లడించింది.ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ బలగాలు చేస్తున్న దాడులలో 190 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా పేర్కొంది.పరిస్థితి ఇలా ఉంటే ఇజ్రాయెల్‌.పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్ లో స్పందించారు.“అక్కడి పరిస్థితిపై ఇజ్రాయెల్‌ ప్రధానితో మాట్లాడటం జరిగింది.తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ భద్రతకు కట్టుబడి ఉంటాం.హమాస్ మిలిటెంట్ లు జరిపిన దాడులలో మరణించిన పౌరులకు, సిబ్బందికి నివాళి అర్పిస్తున్నట్లు” జో బైడెన్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube