రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండల( Ellantakunta ) గాలిపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కట్కూర్ రాజవ్వ ఆకస్మికంగా మరణించటంతో వారి సభ్యులను పరామర్శించి 50 కేజీ ల బియ్యం అందించారు.అలాగే ముస్కాన్ పేట గ్రామంలో జుట్టు మల్లవ్వ ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీ ల బియ్యం అందించారు.
అలాగే ఇల్లంతకుంట గ్రామంలోని పొన్ను స్వామి గుండెనొప్పితో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీ ల బస్తాలను బిటిఆర్ ఫౌండషన్( BTR Foundation ) ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ .ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బిటిఆర్ ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు.పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు బండారి రాజు, పోతురాజు పర్శరాములు, కోమటిరెడ్డి అనిల్,కేశవేణి భూమేష్, బట్టు.మల్లేశం, దురశెట్టి లింగం, చింటూ, పొన్ను శ్రీను, పొన్ను నాంపల్లి, లచ్చవ్వ, నర్సయ్య, బాబు, నందు,తదితరులు పాల్గొన్నారు.