ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి విషయం వాళ్ళు స్వయంగా బయట పెట్టక ముందే సోషల్ మీడియా జనాలు వారితో పెళ్లి వీరితో పెళ్లి అంటూ వార్తలు రాస్తున్నారు.ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో స్వయంగా వార్తలు వచ్చిన సెలబ్రిటీలే క్లారిటీ ఇచ్చేవరకు అవి ఆగడం లేదు.
ఇక తాజాగా రామ్ పోతినేని (Ram Pothineni) పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అలాగే భీమ్లా నాయక్ నటి విడాకుల విషయం మౌనిక రెడ్డి( Mounika Reddy ) స్పందించడంతో ఆగిపోయాయి.ఇక గత నాలుగైదు రోజుల నుండి సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది.
ఇక ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది మంగ్లీ.ఎన్నో ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, మాస్ సాంగ్స్, సినిమా సాంగ్స్ పాడి ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజియెస్ట్ సింగర్ గా మారిపోయింది సింగర్ మంగ్లీ. ఒక మామూలు పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి స్టార్ సింగర్ రేంజ్ కి వెళ్లడం అనేది మామూలు విషయం కాదు.అయితే సింగర్ మంగ్లీ (Singer Mangli) గురించి గత కొద్ది రోజులుగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె వయసు మీద పడుతుండడంతో ఇంట్లో వాళ్ల ప్రెజర్ వల్ల వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది అని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ అసలు ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.అలాగే వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు.నాకు తెలియని బావ ఎక్కడినుండి వచ్చాడో అర్థం అవ్వడం లేదు.నాక్కూడా తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారు భగవంతుడా అసలు ఈ వార్త ఎవరు సృష్టించారో కాస్త నాకు చెప్డి అంటూ సెటైర్ వేసింది.ఇక మంగ్లీ (Mangli) క్లారిటీ ఇవ్వడంతో ఆమె పెళ్లి వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.