విజయ్ ‘లియో’ మూవీని తెలుగు లో అంతకి కొనుగోలు చేస్తారా?

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్ విజయ్‌( Joseph Vijay ) నటించిన లియో సినిమా ( Leo movie )ను ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.విజయ్‌ సినిమా అంటే కేవలం తమిళం వరకే క్రేజ్ ఉంటుంది.

 Vijay Trisha Leo Movie Telugu Dubbing Rights , Leo Movie , Lokesh Kanagaraj ,-TeluguStop.com

కానీ లియో విషయం లో అలా కాదు.మొత్తం పాన్ ఇండియా రేంజ్‌ లో లియో సినిమా కి విపరీతమైన క్రేజ్ ఉంది.

అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో సినిమా రూపొందడమే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Telugu Leo, Tollywood, Trisha, Vijay-Movie

సోషల్‌ మీడియా( Social media ) లో విపరీతమైన క్రేజ్ ఉన్న లియో సినిమా ను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.కానీ అదే సమయం లో నందమూరి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా విడుదల అవ్వబోతుంది.ఈ సినిమా కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.లియో సినిమా ఆ బజ్ ని డామినేట్‌ చేసి జనాల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో సఫలం అవుతుందా అంటే డౌటే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లియో సినిమా ను తెలుగు లో పాతిక కోట్ల కు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారు.ఒక వేళ పాతిక కోట్లకు లియో సినిమా తెలుగు హక్కులు అమ్ముడు పోకుంటే నిర్మాతలు స్వయంగా తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారట.

Telugu Telugu Leo, Tollywood, Trisha, Vijay-Movie

కానీ లియో సినిమా కి గట్టి పోటి ఉన్న కారణంగా సొంతంగా విడుదల చేస్తే థియేటర్ల సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి లియో సినిమా తెలుగు రైట్స్ విషయం లో చాలా గందరగోళం నెలకొంది అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.హీరోయిన్ గా త్రిష ( Trisha )నటించడం వల్ల తెలుగు లో మంచి బజ్‌ క్రియేట్‌ చేయగలదు.కనుక తెలుగు లో పాతిక కోట్లు కాదు కానీ కాస్త ఎక్కువ రేటుకే లియో ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.

మరి చివరకు ఏం జరగబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube