ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి.ఇప్పటికీ అంతుచిక్కని అర్థం కాని మర్మమైన జీవులు కూడా ఈ భూ ప్రపంచంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
వాటి గురించి శాస్త్రవేత్తలు( Scientists ) ఇప్పటి వరకు సరైన సమాచారాన్ని పొందలేకపోయారు.అప్పుడప్పుడు కొన్ని జీవుల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు.
అలాంటి జీవుల్లో ఒక చేప ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది.ఈ చేపలు డైనోసార్లను కూడా వేటాడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ చేప పేరు లాంప్రే ( Lamprey ).ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని మంచినీటి ప్రాంతాలలో ఎక్కువగా జీవిస్తుంది.శాస్త్రవేత్తల ప్రకారం ఈ చేప ఘన పదార్థాలను తినదు.ఇది ద్రవాలపై మాత్రమే జీవిస్తుంది.అంటే వేటాడే ఎర రక్తాన్ని పీల్చి కడుపు నింపుకుంటుంది.ఇది దాదాపు 45 కోట్ల ఏళ్లుగా భూమిపై ఉందని చెబుతున్నారు.
ఈల్ లాంటి ఈ చేపకు దవడలు ఉండవు, అయినప్పటికీ అది తన ఎరను అత్యంత క్రూరంగా చంపుతుంది.దవడలకు బదులుగా, ఇవి పళ్ళతో రక్తాన్ని పీల్చే నోరును కలిగి ఉంటాయి.
వాటితో ఎరను పట్టుకోవడానికి, రక్తాన్ని తీయడానికి ఉపయోగిస్తాయి.ఈ చేపకు శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన.
ప్రస్తుతం 40 రకాల పసిఫిక్ లాంప్రేలు( Pacific lampreys ) ఉనికిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అవి నాలుగు సార్లు అంతరించిపోయే దశకు చేరుకుని మళ్లీ వాటి సంఖ్యను పెంచుకున్నాడు.ఫిమేల్ లాంప్రే ఒకేసారి 2 లక్షల గుడ్లు పెడుతుంది కాబట్టి అవి అంతరించిపోయే దశను ఈజీగా అధిగమించాలి.ఈ చేపలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దానిపై మీరు కూడా ఒక లుక్కేయండి.