బిగ్ బాస్ షో సీజన్7 ( Bigg Boss Show Season 7 )ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న కంటెస్టెంట్లలో కిరణ్ రాథోడ్ ఒకరు.తెలుగు రాకపోయినా వివాదాలకు దూరంగా ఉంటూ అభిమానులకు దగ్గరైన కిరణ్ రాథోడ్ కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తన టాలెంట్ ను ప్రదర్శించకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చానని కిరణ్ రాథోడ్( Kiran Rathore ) కామెంట్లు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరణ్ రాథోడ్ సౌత్ లో హీరోయిన్ గా ఎంత పాపులారిటీ ఉన్నా ముంబైకు వస్తే మాత్రం కష్టాలు పడక తప్పదని అన్నారు.
అప్పటికాలంలో సౌత్ లో టాప్ హీరోయిన్ కూడా బాలీవుడ్( Bollywood ) వాళ్లకు సరిగ్గా తెలియదని అందుకే నేను బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లినా సరిగ్గా నిలదొక్కుకోలేకపోయానని ఆయన కామెంట్లు చేశారు.ఆ తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యానని కిరణ్ రాథోడ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్, ఫేమ్ ను సొంతం చేసుకోవడం సులువు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల వల్ల డిప్రెషన్ కు వెళ్లానని కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత రాత్రికి వస్తున్నావ్ కదా అని అడిగేవారని ఆమె కామెంట్లు చేశారు.కాంప్రమైజ్ అడిగితే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేదానినని ఆమె అన్నారు.
ప్రస్తుతం సమస్యలు తొలగిపోయాయని ఇప్పుడు ఏ పని గురించి ఎవరినీ అడగకపోయినా మంచి అవకాశాలు వస్తున్నాయని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు.గతంలో నేనొకరిని ప్రేమించానని నాలుగేళ్ల రిలేషన్ తర్వాత అతను సరైన వ్యక్తి కాదని అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు.తర్వాత ప్రేమించిన వ్యక్తి కూడా మంచోడు కాకపోవడం వల్ల బ్రేకప్ అయిందని కిరణ్ రాథోడ్ వెల్లడించారు.