అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.భూవివాదంలో ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై కేసు దాఖలు అయింది.
ఈ మేరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై గోల్డ్ ఫిష్ అడోబ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.కోకాపేట స్థలంలో అక్రమంగా చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదేవిధంగా 60 మందితో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.