టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించారని తెలిపాలి.
ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఈ విధంగా నాగేశ్వరరావు( Anr ) ఇండస్ట్రీ పెద్దగా ఒక గొప్ప నటుడిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
ఇకపోతే ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలను( ANR centenary celebrations ) తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా ప్రాణం అందుకే ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ ప్రదేశంలో తన విగ్రహాన్ని ఆవిష్కరించామని నాగార్జున( Nagarjuna ) తెలియజేశారు.
ఇక ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు నేను ఆ విగ్రహాన్ని ఒక్కసారి కూడా చూడలేదు అలా చూస్తే నాన్న మన మధ్య లేరు అన్న భావన నాలో కలుగుతుందని అందుకే ఆ విగ్రహాన్ని అసలు చూడలేదని తెలియజేశారు.ఇక ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి వెంకయ్య నాయుడుకి( Venkaiah Naidu ) ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు అలాగే కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఇలా అక్కినేని కుటుంబ సభ్యులందరితోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి స్టార్ సెలబ్రిటీ లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
అయితే ఈ కార్యక్రమం విషయంలో నాగార్జున తీసుకున్నటువంటి ఒక కఠిన నిర్ణయం వల్ల సమంత చాలా బాధపడిందని తెలుస్తుంది.సమంత ( Samantha ) అక్కినేని కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని కారణాలవల్ల ఈమె విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో ఒక స్టార్ సెలబ్రిటీ అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా అక్కినేని నాగేశ్వరరావు గారితో నాగార్జున గారితో కూడా సమంతకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.నాగ్ మామ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఆ పిలుపు కూడా దూరమైంది.అయితే చాలా సంవత్సరాల తర్వాత నాగచైతన్య( Nagachaitanya ) తన మాజీ కోడల గురించి బిగ్ బాస్ వేదికపై ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలను కుటుంబ సభ్యులను ఆహ్వానించిన నాగార్జున సమంతకు మాత్రం ఆహ్వానం అందలేదట.
సమంత అక్కినేని ఇంటికి మాజీ కోడలు కావడంతోనే తనని కుటుంబ సభ్యులుగా నాగార్జున కన్సిడర్ చేయలేదని అందుకే తనకు ఆహ్వానం అందలేదని చెప్పొచ్చు.అయితే అక్కినేని కుటుంబ సభ్యురాలు కాకపోయినా ఆమె సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కనుక తనకు ఆహ్వానం అందించకపోవడంతో సమంత ఈ విషయంలో చాలా బాధపడిందని తెలుస్తుంది.ఒకవేళ నాగార్జున కనక ఆహ్వానించి ఉంటే సమంత ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేదా అన్న సందేహం కూడా అందరిలోనూ నెలకొంది.అయితే ఈ మధ్యకాలంలో సమంత వ్యవహారం చూస్తే తిరిగి నాగచైతన్యతో కలిసిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.
ఇదే కనుక నిజమైతే ఇటు సమంత అభిమానులు అటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.