బొజ్జ వినాయకుడి కోసం భారీ బంగారు, వజ్రాల ఆభరణాలు రెడీ చేసిన నానా!

వినాయక చవితి( Ganesh Chaturthi ) సందడి దేశమంతటా స్టార్ట్ అయిపోయింది.ఈ క్రమంలో రకరకాల గెటప్పులతో బొజ్జ వినాయకుడు ప్రతిచోటా కొలువుదీరి వున్నాడు.

 Sanjay Nana Vedak Prepared Huge Gold And Diamond Ornaments For Ganesh, Viral La-TeluguStop.com

చాలామంది కళాకారులు తమ గూడంలో వేలసంఖ్యలో గణేషుడి విగ్రహాలను అమ్మకానికి వుంచారు.ఇక గణేశ్ నవరాత్రులు దేశమంతా ఎంత సందడిగా జరుగుతాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనిలేదు.

ఈ సందర్బంగా అన్నిచోట్ల వినాయక మండపాలను అందంగా అలంకరించి పూజలు చేస్తారు.దేశమంతా గణేషుడు సంబరాలు ఒకేత్తైతే ముంబై నగరంలో వినాయకచవితి వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పుకోవాలి.

Telugu Diamonds, Gold, Mumbai, Vinayaka, Latest-Latest News - Telugu

ఎందుకంటే ఇక్కడ గణేశుడి వుత్సవాలు ఒక రేంజులో జరుగుతూ వుంటాయి.అదేవిధంగా ఇక్కడివారు బొజ్జ గణపయ్య కోసం భారీ సైజుల్లో బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు.ఈ నేపధ్యంలోనే బొజ్జ గణపయ్య ఆకారానికి తగినట్లుగా సంజయ్‌ నానా వేదిక్ అనే స్వర్ణకారుడు అదిరిపోయే నగలు తయారుచేశాడు.దాంతో ఈ వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

ఈయన నగలు చేయడంలో సిద్ధహస్తులు.పెద్ద పెద్ద హారాలు, కిరీటాలు ఇలా ఎన్నో రకాల నగలు తయారు చేస్తుంటారు నానా వేదిక్, సంజయ్‌ నానా వేదిక్‌.

ముంబైలో ఈయన్ని నానా గౌరవంగా పిలుచుకుంటారు.దాదాపు రెండు దశాబ్దాలుగా సంజయ్( Sanjay Nana Vedak ) వినాయకుడి విగ్రహాల కోసం బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా.

Telugu Diamonds, Gold, Mumbai, Vinayaka, Latest-Latest News - Telugu

అవును, గణపయ్య అంటే అతనికి ప్రీతి కాస్త ఎక్కువే.అందుకే వినాయకుడికోసం నగలు కావాలనుకున్నవారు కొన్ని నెలల ముందే ఈయనకు ఆర్డర్‌ ఇస్తారు.ఆ ప్రతిమ ఎత్తు, వెడల్పును బట్టి కచ్చితైన కొలతలు తీసుకొని ఆభరణాలు తయారు చేయడం నానా ప్రత్యేకత.ఒక్క ముంబైలోనే కాదు.దేశ, విదేశాల్లో ఉన్న చాలా ఆలయాల్లోని విగ్రహాలు నానా ఆభరణాలు తయారు చేస్తారు.చేతి కడియాలు, కిరీటాలు, నెక్లెస్‌, చెవి కమ్మలు, అభయహస్తం, జంధ్యం, లాకెట్, చేతి కంకణాలు ఇలా పలు రకాల ఆభరణాలు తయారు చేయడం నానా ప్రత్యేకత.

మూడు తరాల నుంచి ఈ పనిలో ఉన్న నానాకు ముంబైలోనే 4 దుకాణాలు కలవు.ఆయనకింద సుమారు 17 మంది స్వర్ణకారులు ఈ ఆభరణాలను తయారు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube