'గుంటూరు కారం' కి భయపడిన 'సలార్'..సినిమాలో అసలు విషయమే లేదా?

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) హీరో గా నటించిన ‘సలార్’.ఈ సినిమా గురించి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

 Mahesh Babu Vs Prabhas Guntur Karam Salaar Release Dates,mahesh Babu,prabhas,gun-TeluguStop.com

ఎందుకంటే ప్రభాస్ ని ఊర మాస్ యాంగిల్ లో చూసి చాలా కాలం అయ్యింది.

Telugu Salaar, Guntur Karam, Mahesh Babu, Prabhas, Prashant Neel-Latest News - T

దానికి తోడు కేజీఎఫ్ చిత్రం తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) తెరకెక్కిస్తున్న సినిమా కావడం కూడా ఈ చిత్రం పై ఈ స్థాయి హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం అయ్యింది.ముఖ్యంగా ఈ సినిమా టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.థియేటర్ లో చూసినప్పుడు అయితే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితమే ఈ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయాయ్యి.

Telugu Salaar, Guntur Karam, Mahesh Babu, Prabhas, Prashant Neel-Latest News - T

అడ్వాన్స్ బుకింగ్స్( Salaar Advance Bookings) ప్రారంభించిన వెంటనే ఈ చిత్రానికి 5 లక్షల డాలర్స్ వచ్చాయి.కేవలం #RRR చిత్రానికి తప్ప, ఈ స్థాయి ట్రెండింగ్ మరో సినిమాకి ఇప్పటి వరకు అక్కడి ట్రేడ్ పండితులు చూడలేదు.అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వడం లేదు అనే వార్త తెలియడంతో నార్త్ అమెరికా లో ఉన్న థియేటర్స్ అన్నీ సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ని తమ థియేటర్స్ ఆన్లైన్ పోర్టల్ నుండి తొలగించేసింది.దీనితో ఈ చిత్రం వాయిదా పడింది అనే వార్త నిజమే అనే విషయం ధ్రువీకరణ అయ్యింది.

సడన్ గా ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యడానికి కారణం, ప్రభాస్ కి చాలా సన్నివేశాలు నచ్చకపోవడమే.ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత ఎందుకో ఆయనకీ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందట.

డైరెక్టర్ ని పిలిచి ఎడిట్ చెయ్యమని అడిగాడట.

Telugu Salaar, Guntur Karam, Mahesh Babu, Prabhas, Prashant Neel-Latest News - T

మళ్ళీ రీ ఎడిట్( Salaar Re Edit ) చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది, సినిమాని వాయిదా వెయ్యాల్సి వస్తుంది అని అన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.అయితే వాయిదా వెయ్యమని ప్రభాస్ చెప్పాడట.ఆయన మాటకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రీ ఎడిటింగ్ వర్క్ శరవేగంగా సాగుతుంది.ముందుగా ఈ సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ( Guntur Karam )చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది.ఆ చిత్రం తో పోటీ పడితే కేవలం 50 శాతం థియేటర్స్ లో మాత్రమే విడుదల చెయ్యాల్సి వస్తుందని, ‘సలార్’ చిత్రానికి పూర్తి స్థాయి రిలీజ్ కావాలని, అందుకే ఈ చిత్రాన్ని నవంబర్ 10 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube