‘గుంటూరు కారం’ కి భయపడిన ‘సలార్’..సినిమాలో అసలు విషయమే లేదా?

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) హీరో గా నటించిన 'సలార్'.

ఈ సినిమా గురించి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ప్రభాస్ ని ఊర మాస్ యాంగిల్ లో చూసి చాలా కాలం అయ్యింది.

"""/" / దానికి తోడు కేజీఎఫ్ చిత్రం తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashant Neel ) తెరకెక్కిస్తున్న సినిమా కావడం కూడా ఈ చిత్రం పై ఈ స్థాయి హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం అయ్యింది.

ముఖ్యంగా ఈ సినిమా టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.థియేటర్ లో చూసినప్పుడు అయితే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్దీ రోజుల క్రితమే ఈ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయాయ్యి.

"""/" / అడ్వాన్స్ బుకింగ్స్( Salaar Advance Bookings) ప్రారంభించిన వెంటనే ఈ చిత్రానికి 5 లక్షల డాలర్స్ వచ్చాయి.

అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వడం లేదు అనే వార్త తెలియడంతో నార్త్ అమెరికా లో ఉన్న థియేటర్స్ అన్నీ సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ని తమ థియేటర్స్ ఆన్లైన్ పోర్టల్ నుండి తొలగించేసింది.

దీనితో ఈ చిత్రం వాయిదా పడింది అనే వార్త నిజమే అనే విషయం ధ్రువీకరణ అయ్యింది.

సడన్ గా ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యడానికి కారణం, ప్రభాస్ కి చాలా సన్నివేశాలు నచ్చకపోవడమే.

ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత ఎందుకో ఆయనకీ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందట.

డైరెక్టర్ ని పిలిచి ఎడిట్ చెయ్యమని అడిగాడట. """/" / మళ్ళీ రీ ఎడిట్( Salaar Re Edit ) చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది, సినిమాని వాయిదా వెయ్యాల్సి వస్తుంది అని అన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

అయితే వాయిదా వెయ్యమని ప్రభాస్ చెప్పాడట.ఆయన మాటకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రీ ఎడిటింగ్ వర్క్ శరవేగంగా సాగుతుంది.ముందుగా ఈ సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

సంక్రాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' ( Guntur Karam )చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది.

ఆ చిత్రం తో పోటీ పడితే కేవలం 50 శాతం థియేటర్స్ లో మాత్రమే విడుదల చెయ్యాల్సి వస్తుందని, 'సలార్' చిత్రానికి పూర్తి స్థాయి రిలీజ్ కావాలని, అందుకే ఈ చిత్రాన్ని నవంబర్ 10 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.

ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పతకాల వేట..