తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం రేపు జరగనుంది.ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.