ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ గా ”పుష్ప ది రూల్” చేస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ఇది.పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప 2( Pushpa 2 ) టాప్ లో ఉంది అని చెప్పాలి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంది.ఈ సినిమా 2024 సమ్మర్ రేస్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో( Trivikram Srinivas ) సినిమాను లైన్లో పెట్టాడు.ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో( Director Atlee ) చేయనున్నాడు అనే టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కించిన జవాన్ సినిమా( Jawan Movie ) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ కు కథ చెప్పాడని టాక్.అయితే అల్లు అర్జున్ జవాన్ రిజల్ట్ చూసిన తర్వాత ఓకే చెప్పాలని అనుకున్నారట.
మరి ఇప్పుడు జవాన్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే అని అంటున్నారు.మరి ఐకాన్ స్టార్ తో అట్లీ ఎలాంటి కథను తెరకెక్కిస్తారో చూడాలి.