మంచు మోహన్ బాబు( Mohan Babu ) ముద్దుల కూతురు మంచు లక్ష్మి( Lakshmi Manchu ) ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది.
అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది.నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది.
అలానే లక్ష్మి మంచు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది.లక్ష్మి బుల్లి తెర పై కూడా కొన్ని షోస్ కి హోస్టింగ్ చేసింది.
ఇప్పుడేమో తన కూతురుతో కలిసి అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు, టీవీ షోస్ కి దూరంగా ఉంటుంది .మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఎందుకు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుంది అనే ప్రశ్న చాలామందిలో ఉంది .అయితే ఆమెకి సరైన అవకాశాలు రాకపోవడం వల్లనే ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుందని కొందరు అంటున్నారు.ఇక గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో లక్ష్మి తన హెయిర్ స్టైల్ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేసారు అని చెప్పింది.ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియా( Social media ) లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘ నా నుదురు చాలా పెద్దది.ఇండియా లో అందరూ నా నుదుటి పై విమానాలు కూడా ల్యాండ్ అవ్వగలవు అంటూ ఏడిపించేవారు.
అందుకే నేను ఎప్పుడు ఇండియా వచ్చిన చాలా జాగ్రత్తగా జుట్టుని కాస్త ముందుకి సరిచేసుకొని వస్తాను ‘ అని చెప్పింది.
అంతేకాకుండా మంచు లక్ష్మి చెవులు కూడా చాలా పెద్దగా ఏనుగు చెవులలా ఉంటాయని అందరూ ఆమెని కామెంట్ చేసేవారట.అలా అందరూ అనే మాటలు విని ఆమె బాధపడుతుంటే వాళ్ళ తాతగారు వచ్చి ‘ పెద్ద చెవులు ఉన్న వారు అదృష్టవంతులు, నువ్వేమి బాధపడకు.న చెవులు కూడా అలానే పెద్దవిగా ఉంటాయి.
నీకు పెద్ద చెవులు ఉండడం నీ అదృష్టం ‘ అంటూ లక్ష్మి కి సర్దిచెప్పేవారట.ఇక అప్పటినుండి ఆమె తన చెవులను ఇష్టపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.
లక్ష్మి మంచు తన నుదురు గురించి, చెవుల గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.