కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) గారి పిల్లల గురించి మనందరికీ తెలిసినదే.ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు.
కూతురు లక్ష్మి, కొడుకులు విష్ణు, మనోజ్( Manoj Manchu ).మంచు వారి కుటుంబం అంతా ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ముఖ్యంగా మంచు లక్ష్మి.ఈమె మాట్లాడే మాటలను తెగ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు.మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తండ్రి మంచు మోహన్ బాబు గారి గురించి, అలాగే తమ్ముడు విష్ణు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
తన తండ్రికి తనమీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని దానికి కారణం కోడలే అని అన్ని విష్ణు భార్య వేరోనికా రెడ్డి ( Veronica Reddy )ని ఉద్దెశించి అన్నారు.తమ్ముళ్లకు పెళ్లి కాక ముందు నేనంటే వాళ్లకు అమితమైన ప్రేమ ఉండేదని కానీ వాళ్లకు పెళ్లిళ్లు అయ్యి కోడళ్ళు వచ్చాక తన మీద ప్రేమ కాస్త తగ్గిందని అన్నారు.ఎప్పుడైనా లక్ష్మి తన పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా తన తండ్రి తనకు విన్ను(వేరోనికా రెడ్డి ముద్దు పేరు) అని పిలవటం మొదలు పెట్టారని అన్నారు.
అదే సమయంలో తన తండ్రి కోడళ్లను చూసుకుంటున్న విధానానికి చాలా సంతోషముగా ఉందని అన్నారు.మంచి లక్ష్మి( Manchu Lakshmi ) చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంచు విష్ణు భార్య వేరోనికా రెడ్డి.ఈమె 2008 లో మంచు విష్ణు ని పెళ్లాడింది.వీరికి వీరికి నాలుగు పిల్లలు ఉన్నారు.మంచు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్.మనోజ్ ౨౧౦౫ లో ప్రణతి రెడ్డి ని వివాహమాడాడు.వీరు 2019 లో విడాకులు తీసుకున్నారు.
మనోజ్ 2023 లో భూమా మౌనిక రెడ్డిని( Bhuma Mounika Reddy ) రెండో వివాహం చేసుకున్నాడు.ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగి రెడ్డి కుమార్తె.
ఈ పెళ్లితో మంచు ఫ్యామిలీ లో ఉన్న గొడవలు బాహాటంగానే అందరికీ తెలిసి పోయాయి.ఇక మంచు మోహన్ బాబు కి ఈ పెళ్లి ఇష్టం లేదు అనే వాదన కూడా వినిపించడం విశేషం.