మెడికల్ సీట్ల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.ఏపీలో మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
మెడికల్ సీట్లలో విద్యార్థులకు న్యాయం చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.లేని పక్షంలో ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అనంతరం చంద్రబాబుపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.ఐటీ నోటీసులు ఇస్తే చంద్రబాబు అవినీతి చేశారని దుష్ప్రచారం చేస్తారా అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు అవినీతిని బయటకు తీస్తామన్న జగన్ నాలుగేళ్లలో ఏం చేయగలిగారని ప్రశ్నించారని తెలుస్తోంది.