ఆర్ ఎక్స్ 100( Rx 100 ) సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో నే మొదటి సక్సెస్ అందుకున్నాడు ఆయన ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం తో హీరో గా కాకుండా మధ్యలో విలన్ గా కూడా నటించి తన మార్క్ నటన తో అందరిని మెప్పించాడు నిజానికి ఈయన చేసే నటన చాలా బాగుంటుంది.కానీ ఈయన స్టోరీ సెలెక్షన్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఈయనకి ఇండస్ట్రీ లో ఎక్కువ సక్సెస్ లు రాలేదు అయితే రీసెంట్ గా ఆయన చేసిన బెదురులంక 2012( Bedurulanka 2012 ) సినిమా అతనికి ఒక మంచి హిట్ అయితే ఇచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ లో కూడా నటులు చాలా బాగా నటించి మెప్పించారు.ఇక ఈ బెదురులంక 2012 సినిమా వర్కింగ్ డేస్ లో బాగానే హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగించగా ఇన్ని రోజులకు ఈ సినిమా ఎంత కలక్షన్స్ ని వసూల్ చేసింది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
టోటల్ గా ఈ సినిమా యొక్క 6 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…ఓవరాల్ గా సినిమా 4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ మీద ఏకంగా 96 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం…నిజానికి ఈ సినిమా మంచి కామెడీ తో సాగే సినిమా కావడం అలాగే ఫ్యామిలీ మొత్తం కలిపి చూసే సినిమా కావడం వల్ల అందరూ ఈ సినిమా ను ఎక్కువగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక కాలేజీ స్టూడెంట్స్ అయితే మొత్తం థియేటర్ లా దగ్గరే సందడి చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తో కార్తికేయ( Karthikeya ) మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి…
నిజానికి ఈ సినిమా తర్వాత కార్తికేయ వేరే ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయాలనుకున్నాడు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి కి ఇండస్ట్రీ లో ఆల్రెడీ తెలిసిన ఒక డైరెక్టర్ రీసెంట్ గా కార్తికేయ కి కథ చెప్పడం తో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అంటూ కామెంట్లు వస్తున్నాయి మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది…అది ఒకే అయితే కొత్త డైరెక్టర్ తో చేసే సినిమా ఈ సినిమా తర్వాత ఉంటుంది…
.