తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్( Naresh )ఒకరు ఈయన హీరోగా నటించడమే కాకుండా ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన మొదటి భార్య కుమారుడు నవీన్( Naveen ) ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తమ కుటుంబ విషయాలను అందరితోనూ పంచుకుంటున్నారు.
నవీన్ హీరోగా పరిచయమైనప్పటికీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన డైరెక్టర్గా మారిపోయారు.
సాయి ధరంతేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలిం కి డైరెక్టర్ గా వ్యవహరించారు.
అయితే ఒక ఇంటర్వ్యూ పాల్గొన్నటువంటి నవీన్ మహేష్ బాబు( Mahesh Babu )తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ కృష్ణ విజయనిర్మల( Vijaya Nirmala )గారి మధ్య ఎంతో ప్రేమ ఉండేదని తెలిపారు.
విజయనిర్మల మరణించడంతోనే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేక కృష్ణ ( Krishna )కూడా ఎంతో బాధపడుతూ మరణించారనీ తెలుస్తుంది.ఇది ఎంతవరకు నిజమని ప్రశ్నించారు.
కృష్ణ గారి విషయంలో ఇది నిజమేనని తెలిపారు.కృష్ణ గారు విజయ నిర్మల గారిని ఎంతగానో ప్రేమించారు.నాన్నమ్మ చనిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి నాకు ఏడాది సమయం పట్టిందని నవీన్ తెలిపారు.ఇక నానమ్మ చనిపోయిన తర్వాత కృష్ణ గారిని మహేష్ బాబు చాలాసార్లు తన ఇంటికి తీసుకువెళ్లాలని బలవంతం చేశారు కానీ కృష్ణ గారు మాత్రం 40 సంవత్సరాలు పాటు ఆ ఇంట్లో నాన్నమ్మతో కలిసి ఉండటం వల్ల ఆ జ్ఞాపకాలను వదిలేసి వెళ్లలేకపోయారని నవీన్ తెలిపారు.
కృష్ణ గారు చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు ఇప్పటికీ మాతో మాట్లాడతారని నవీన్ తెలిపారు.ఆయనతో నాకు చాలా మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు.ఇప్పటికీ కూడా రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటామని, మహేష్ అన్నయ్యతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అంటూ ఈ సందర్భంగా నవీన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ తనవల్ల నాకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదు తనతో ఎప్పుడూ రమ్య రఘుపతి మంచిగానే ఉండేది అంటూ ఈయన తెలిపారు.