ఇండియాలో విస్తృతమైన ట్రైన్ నెట్‌వర్క్ ఉంది.ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సరే సులువుగా ట్రైన్‌లో వెళ్లొచ్చు.
ట్రైన్ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.బస్సుల్లో ఇరుకుగా ఉంటుంది.
కానీ ట్రైన్ లో విశాలంగా ఉంటుంది.అందుకే ఎక్కువమంది ట్రైన్ జర్నీని( Train Journey ) ఇష్టపడతారు.
ఏ ప్రాంతానికి అయినా వెళ్లాలంటే ట్రైన్‌లో వెళ్లేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.ఇక బస్సు టికెట్ల రేటు కంటే ట్రైన్ టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి.
దీంతో సామాన్య ప్రజలు అధిక ఛార్జీలు ఖర్చు పెట్టి బస్సులో వెళ్లే బదులు ట్రైన్ లో వెళుతూ ఉంటారు.
అయితే ట్రైన్ టికెట్లపై అనేక ఆఫర్లను కూడా వివిధ బుకింగ్ యాప్స్ అందిస్తూ ఉంటాయి.అలాగే ఇండియన్ రైల్వేస్( Indian Railways ) కూడా కొంతమందికి డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది.స్టూడెంట్స్, పేషెంట్లు, దివ్యాంగులు, కంటిచూపు లేనివారు, మానసిక పరిపక్వత లేనివారు, వేరేక వ్యక్తి సహాయం లేకుండా జర్నీ చేయలేనివారికి ట్రైన్ టికెట్లపై 75 శాతం డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది.
జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీ ప్రయాణంపై కూడా తగ్గింపు పొందవచ్చు.ఇక 1ఏసీ, 2ఏసీ వంటి తరగతుల్లో ప్రయాణంపై 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఏసీ చెయిన్ కార్( AC chain car ) ప్రయాణంపై 25 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.అలాగే ఎస్కార్ట్‌గా వచ్చేవారికి కూడా డిస్కౌంట్ అందిస్తుంది.అలాగే మాట్లాడలేని, వినలేనివారికి కూడా ట్రైన్ టికెట్లపై 50 శాతం డిస్కౌంట్, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కూడా టికెట్ల రేటుపై డిస్కౌంట్ అందిస్తుంది.కిడ్నీ, తలసేమియా, హార్ట్ పేషెంట్లు, క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, ఎనీమియా రోగులకు ట్రైన్ టికెట్లపై తగ్గింపు ఇస్తోంది.
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వీటి గురించి తెలుసుకుని బుక్ చేసుకుంటే డిస్కౌంట్ పొందవచ్చు.