అరుదైన ఫోటో షేర్ చేస్తూ చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్!

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.చిరంజీవి తన 68వ పుట్టిన రోజును జరుపు కుంటున్న నేపథ్యంలో చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెష్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.

 Pawan Kalyan Wishes To Chiranjeevi With Rare Pic, Megastar Chiranjeevi, Pawan-TeluguStop.com

ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తమ విషెష్ తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక పోస్ట్ షేర్ చేసారు.నిన్ననే ఈయన పార్టీ తరపున విషెష్ తెలుపుతూ నోట్ రిలీజ్ చేసారు.ఇక ఈ రోజు ఆయన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి పవన్ తన అన్నయ్య మెగాస్టార్ పిక్ షేర్ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

పవన్ ఇంస్టాగ్రామ్ లో అరుదైన ఫోటో షేర్ చేస్తూ ” అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ తెలిపాడు.ఇక ఈ పిక్ మెగాస్టార్ యంగ్ గా ఉన్నప్పుడు పవన్ చిన్న పిల్లాడిలా పక్కనే ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసాడు.ఈ పిక్ అందరిని అలరిస్తుంది.

చిరును ట్యాగ్ చేసి మరీ ఈ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం ర్తెట్టింపు అయ్యింది.ఇక మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రెండు సినిమాల అనౌన్స్ మెంట్స్ వచ్చాయి.

చిరు నటించనున్న 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే చిరు 157వ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా యంగ్ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Mallidi Vasishta ) తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube