మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈయన నటించిన గాండీవదారి అర్జున సినిమా( Gandeevadhari Arjuna ) విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈయన తదుపరి సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈయన పెళ్లి సమయానికి ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో శరే వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఈయన తదుపరిచిత్రం మట్కా( Matka ) సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాకు పలాస ఫ్రేమ్ డైరెక్టర్ కరణ్ కుమార్ (Karan Kumar) దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క టాలీవుడ్ సినిమాలను స్పెషల్ సాంగ్ అరేంజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఈ పాటలో సందడి చేయడానికి ముంబై ముద్దుగుమ్మ నోరా ఫతేహి( Nora Fatehi ) నీ ఎంపిక చేశారని తెలుస్తుంది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నోరా ఫతేహి భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.ఈ పాటలో నటించడం కోసం ఈమె ఏకంగా 30 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం.ఇలా ఐదు నిమిషాల ఈ పాట కోసం 30 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.